ప్రెగ్నెన్సీ వద్దనుకునే వారికి ఇకపై ఆ భయం ఉండదు! గర్భ నిరోధక సరికొత్త సాధనం 

అవాంఛిత గర్భం చాలామంది జీవితాల్లో ఇబ్బందలు కలిగేలా చేస్తోంది. చాలా మంది పెళ్లైన వెంటనే గర్భం దాల్చాలి అనుకోరు. అలాగే ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కోసం కాస్త సమయం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో ఈ అవాంఛిత గర్భం పెద్ద సమస్యనే సృష్టిస్తుంది. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలి చాలా మంది అనుకోరు. ఇంకొందరు ఒక బిడ్డ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి వారికి అవాంఛిత గర్భం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. సాధారణంగా గర్భం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి గర్భం దాల్చే అవకాశం లేకపోలేదు.

అలాంటప్పుడు కొందరు అబార్షన్ ని ఎంచుకోగా.. ఇంకొందరు మాత్రం తప్పక గర్భాన్ని కొనసాగిస్తుంటారు. అయితే అబార్షన్ కి వెళ్తే స్త్రీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మార్కెట్ లో అవాంఛిత గర్భాన్ని  నిరోధించేందుకు సరికొత్త సాధనం ఒకటి మార్కెట్ లోకి వచ్చింది. అవాంఛిత గర్భం ఎప్పటికైనా స్త్రీలకు పెద్ద సమస్యనే చెప్పాలి. వాళ్లు మెంటల్ గా సిద్ధంగా లేని సమయంలో, కొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలి అనుకున్న సమయంలో గర్భం దాలిస్తే అది లేనిపోని ఇబ్బందులను తెచ్చే అవకాశం ఉంటుంది. కొందరు గర్భం దాల్చకుండా ఆరోగ్య కరమైన పద్ధతులను పాటిస్తుంటే..

ఇంకొందరు మాత్రం గర్భం దాల్చకుండా ఉండేందుకు మాత్రలను వాడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. అలాంటి వారి కోసం ఇప్పుడు సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక చిన్న సూదిలాంటి పరికరాన్ని మహిళలలు తమ మోచేతి పైభాగంలో అమర్చుకుంటే మూడేళ్ల వరకు మీకు అవాంఛిత గర్భం గురించి భయపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రయోగాల్లో ఈ విధానం ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ఇప్పటికే కృషి చేస్తోంది.

ఈ పరికరాన్ని దాదాపు ఏడాదిపాటు 100 మంది మహిళలపై పరీక్షించారు. వారిలో కేవలం ఒక్కరి కంటే తక్కువ వైఫల్య రేటు ఉంది. మాత్రలు, ఇప్పటికే అమలులో ఉన్న గర్భనిరోధక పద్ధతులతో పోలిస్తే ఈ విధానం చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పరికరం అమర్చేందుకు ఇప్పటికే స్టాఫ్ నర్సులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇది కేవలం ఇంజెక్షన్ చేసినట్లు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. చాలా విధానాలతో పోలిస్తే దీంతో సైడ్ ఎఫక్ట్స్ కూడా ఉండని తెలియజేస్తున్నారు. ఇంక ఈ పరికరం ఎలా ఉంటుందంటే.. 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 4 మిల్లీమీటర్ల మందంతో ఈ పరికరం ఉంటుంది.

దీనిని ఇంజెక్షన్ చేసిన విధంగానే మహిళల మోచేతి పైభాగన పైపొరలో అమరుస్తారు. దీనిని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అంటారు. ఈ సాధనం నుంచి గర్భం నిరోధించే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్.. మహిళ గర్భాశయం నుంచి అండం రిలీజ్ కాకుండా ఆపుతుంది. ఈ సాధనంతో మూడేళ్ల వరకు గర్భం దాల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు ఆ సాధనాన్ని తొలగించవచ్చు. ఈ పరికరం తొలగించిన 48 గంటల తర్వాత గర్భం దాల్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ సరికొత్త గర్భ నిరోధక సాధనం  ఉపయోగకరమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.