బరువు తగ్గాలి అనుకునే వారు ఈ ఆహరం అస్సలు తినకూడదు…

ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్ ఫాలో అవుతున్నారు, ఈ డైట్ లో కూడా రకరకాల పేర్లతో డైట్స్ ఉన్నాయి, అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి డైట్ ను పాటించాలి? వెయిట్ లాస్ కోసం మనం తినే క్యాలరీస్ నీ తగ్గించుకోవాలి, ఇలా తగ్గించుకో గలిగితే 80% వెయిట్ లాస్ జరుగుతుంది, 15% ఎక్ససైజ్ ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల మనకి క్యాలరీస్ ఎక్కడినుండి వస్తాయో అవి చూసుకుని వాటిని మనం తగ్గించుకుంటే వెయిట్ లాస్ అనేది వస్తుంది. అయితే క్యాలరీస్ ఎక్కడి నుండి వస్తాయి, వేటినుండి వస్తాయి అనే ప్రశ్న అందరిలో ఉంటుంది. ఇవి ముఖ్యంగా రైస్, ఫ్రూట్స్, దుంపలు, షుగర్. ఈ నాలుగింటిలో కూడా మేజర్ గా క్యాలరీస్ ఉంటాయి. వీటిలో ఫ్రూట్స్,షుగరు, దుంపలు అనేవి ఎక్కువగా తీసుకోము. రోజులో రెండు ,మూడు పూటలు తినేది రైస్. రైస్ లో బ్రౌన్ రైస్ ,వైట్ రైస్, అటుకులు, బొంగులు ఇలాంటి రైస్ పదార్థాలను ఆపగలిగితే క్యాలరీస్ తగ్గుతాయి. ఇలా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు క్యాలరీస్ ని తగ్గించుకుంటూ డైట్ మెయింటెన్ చేస్తూ ఉండాలి.

ఇంతకు ముందు కాలంలో పెద్దవారు వారానికి ఒక రోజు రెండు రోజులు ఎక్కువగా ఫాస్టింగ్ లాంటివి ఉండేవారు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఫాస్టింగ్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అనే చెప్పవచ్చు. పొట్ట ఖాళీగా ఉంటే ఎనర్జీ బాడీకి ఇవ్వకపోతే బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగేలాచేస్తుంది. అందువల్ల మనం మన శరీరానికి ఆ టైం ఇవ్వగలిగితే బాడీ అనేది క్యాలరీస్ ని కరిగేలా చేస్తుంది. కానీ మనం ఆ టైం ఇవ్వడంలేదు, ఒక పది గంటలు మాత్రమే రాత్రి నిద్రపోయే టైం లో మాత్రమే పొట్ట ఖాళీగా ఉంటుంది. ఇలా పొట్ట కు ఎక్కువ ఖాళీ ఇస్తే బాడీ ఫ్యాట్ ని అదే కలిగించేలా చేస్తుంది, ఇలా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. హిందువులకు ప్రతి రెండు వారాలకి వచ్చే ఏకాదశి ఉంటుంది, ఈ ఏకాదశి రోజున 24 గంటలు ఫాస్టింగ్ చేయమని చెప్తారు.

అలాగే క్రైస్తవ మతంలో కూడా 40 రోజులు ఫాస్ట్ చేయమని చెప్తారు. అలాగే ఇస్లాం మతస్తులు కూడా నెలరోజులు ఫాస్టింగ్ చేస్తారు. అన్ని మతాలకు ఉంటుంది కానీ దీనిని చాలామంది పాటించడంలేదు. వారి వారి మతవిశ్వాసాలను అనుసరించి కరెక్ట్గా చేసినా సరే పొట్ట తన ఫ్యాట్ ని తగ్గిస్తుంది. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేస్తే అది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ గా డివైడ్ అయ్యి అవి కణానికి చేరడానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే,ఉదయం ఎనిమిది గంటలకు మనం తిన్న ఆహారం కణాలకు చేరుతుంది. ఆ తర్వాత మనం ఏమీ తినకుండా ఉంటే అప్పుడు ఈ పోషకాలు అయిపోయి అప్పుడు బాడీ లో ఉన్న ఫ్యాట్ ని కరిగించడం స్టార్ట్ అవుతుంది. కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్ అని పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటూనే ఉంటాం,