మే 16th మొదటి చంద్రగ్రహణం భారత దేశంలో ఉందా? గర్బిని స్త్రీలు జాగ్రత్తలు….

2022 మే 16వ తేదీన ఈ ఏడాదిలో మొట్టమొదటి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ దేశానికి ఉండబోతుంది, ఎక్కడ ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం! సూర్యగ్రహణం వలె చంద్రగ్రహణం కూడా సనాతన ధర్మంలో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది సూర్య గ్రహణం తర్వాత సరిగ్గా పదిహేను రోజుల అనంతరం చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ నెల 16వ తేదీ 2022న ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. హిందువుల క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం 2022 వ సంవత్సరం లో రెండు చంద్ర గ్రహణాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం సంభవించే చంద్ర గ్రహణాలు 2 సంపూర్ణమైనవి.ఈ గ్రహణం ప్రపంచంలో అనేక ప్రాంతాలలో కనిపించబోతుంది, ఈ చంద్ర గ్రహణాల ప్రభావం భారతదేశంలో తక్కువ కనిపిస్తుందని తెలుస్తుంది.

ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాలలో దీని ప్రభావం కనిపిస్తుందో తెలుసుకుందాం! 2022 సంవత్సరంలో చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2022 లో మొదటి చంద్ర గ్రహణం 16 మే, రెండవ చంద్రగ్రహణం నవంబర్ 8న ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం చంద్రగ్రహణం సోమవారం ఉదయం 8 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగా ఉండబోతుంది. ఈ యొక్క మొదటి చంద్రగ్రహణం ఏ ప్రదేశాల్లో ఉండబోతుంది అంటే, ఈ గ్రహణము నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా మహా సముద్రం, హిందూ మహాసముద్రం ఇలాంటి ప్రదేశాలలో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుంది.

అయితే ఈ చంద్ర గ్రహణ ప్రభావం మన దేశంలో లేదు కనుక ఎలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. భారత దేశంలో చంద్ర గ్రహణ ప్రభావం చెల్లుబాటు కాదు. చంద్రగ్రహణం యొక్క శుభం లేదా అశుభఫలితాలు భారతదేశంలో కనిపించవు. భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు అడ్డంగా వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది. సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖ పై వచ్చినప్పుడు భూమిపై చంద్రబింబం పడే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రునిపై కొద్దిగా నీడ పడుతుంది అప్పుడు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.