బొప్పాయి ఆకుతో తెల్లని జుట్టుని పూర్తిగా నల్లగా చేసుకోవచ్చు…!!

ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలామంది జుట్టు త్వరగా నేరిసిపోతుంది. దాన్ని కవర్ చేసుకునేందుకు రకరకాల హెయిర్ స్టైలు వాడుతూ ఉండాలి. తింటున్న ఆహారంలో లోపము పెరుగుతున్న కాలుష్యము లేదా రసాయనాలతో తయారు చేసిన షాంపూలు వాడడం వల్ల మన జుట్టు తెల్లబడిపోతుంది. త్వరగా.. కారణం ఏదైతేనే ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి యువత వరకు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య తెల్ల జుట్టు మన పెద్దవాళ్లకైతే 47, 50 ఏళ్లు వచ్చాక జుట్టు నేరిసేది కానీ ఇప్పుడైతే చిన్నపిల్లల మొదలు 30 ఏళ్ల లోపు వారికి కూడా తెల్ల జుట్టు చూస్తున్నాం. మరి ఈ తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా ఎలా మార్చుకోవాలి. రాలిపోతున్న జుట్టుకు ఎలా బ్రేక్ వేయాలి. అలాగే తలను పొడవుగా ఆరోగ్యంగా ఎలా పెంచుకోవాలి.

అనే విషయాలు చూద్దాం.. మన ఊరుకుల పరుగుల జీవితంలో శరీరానికి తగిన పోషకాలు విటమిన్లు అందడం లేదు. బయట తిళ్ళకి బాగా అలవాటు పడిపోయాం. అందువల్ల సరైన పోషకాలు విటమిన్ల లోపాల వల్ల జుట్టు త్వరగా నేరిసిపోతుంది. దాన్ని కవర్ చేయడానికి మనం పడే పాట్లు ఎన్నో కదా.. అలాకాకుండా ఇంట్లోనే ఈ రెమిడి ట్రై చేసి చూడండి.. తెల్ల జుట్టు తగ్గడంతో పాటు జుట్టు రాలడం, చుండ్రు, దురదలు వంటి సమస్యలు కూడా పోతాయి. అంతే కాకుండా జుట్టు చాలా ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ముందుగా రెండు బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి సరిపోతుంది.

దీనికి వాటర్ ఎక్కువ పట్టదు. పేస్టులా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి బొప్పాయి ఆకుల రసాన్ని తీసి ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో నాలుగు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఒక గ్లాసు నీరు వేసి అర గ్లాసు నీరు అయ్యేంతవరకు స్టవ్ మీద మరిగించండి. ఇప్పుడు మరొక పాత్రను తీసుకొని మీరు రెగ్యులర్గా వాడే హెన్నా పౌడర్ కొంచెం వేసుకోండి. అంటే మీ హెయిర్ కి సరిపడా హెన్న పౌడర్ ఈ బౌల్లో వేయండి. ఇప్పుడు వేసిన తర్వాత బొప్పాయి ఆకుల రసం కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపండి. అలాగే మనం కాఫీ పొడి డికాషన్ రెడీ చేసుకున్నాం కదా.. అది కూడా ఇందులో వేసి బాగా కలపండి. ఒక పేస్టు లాగా అవుతుంది.

రాత్రంతా మూత పెట్టి అలా ఉంచేయండి. ఒకవేళ రాత్రంతా మూత పెట్టి అలా ఉంచడం కుదరకపోతే కనీసం ఐదు గంటల పాటు అయినా అలా నాన్ననివ్వాలి. ఆ తర్వాత తలకు పట్టించుకోవడమే అంతే ముందుగా జుట్టు కుదుళ్లకు ఆ తర్వాత తలకి బాగా అప్లై చేసి ఒక గంట పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత ఎలాంటి షాంపూ వాడకుండా ఒట్టినీళ్ళతో అంటే ప్లైన్ వాటర్ తో జుట్టుని కడిగేసుకోండి. ఆ మరుసటి రోజు జుట్టుకి నూనె పెట్టుకుని ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలా బొప్పాయి ఆకులు వాడటం వల్ల తలలో చుండ్రు అలాగే దురదలు పోతాయి.

అంతేకాకుండా చుట్టూ బాగా సైనిగా ఉంటుంది. మంచి కండిషనర్ల పని చేస్తుంది. బొప్పాయి ఆకుల్లో ముఖ్యంగా పెనోలిక్ అనే కాంపౌండ్ పాపాయి ఆల్కనోయిస్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి ఆంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి మనకు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి తలలో ఎటువంటి బాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అంతేకాకుండా బొప్పాయి ఆకుల్ని మిక్సీలో వేసి తిప్పితే గుజ్జులా వస్తుంది కదా.. దాన్ని వడకడితే రసం వస్తుంది. ఆ రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మం మీద ఉండే అలర్జీలు దురదలు వంటివి పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది..