మందార చెట్టు మీ ఇంట్లో వుందా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి…

ఈరోజుల్లో చాలామంది తమ ఇళ్ల దగ్గర మందార చెట్లను పెంచుతూ ఉన్నారు. రెక్క మందారం కావచ్చు, లేదా ముద్దమందారం కావచ్చు, అన్ని రకాల మందార చెట్లను పెంచుతున్నారు. రంగు రంగుల మందార పూల చెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి అని, అందరూ ఇంటి దగ్గర మందార చెట్లను పెంచేస్తూ ఉన్నారు. కానీ ఏ రంగులో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చు, అసలు మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చా పెంచితే ఏం జరుగుతుంది,

అనే విషయం చాలామందికి తెలియదు. మరి ఇంతకీ ఏ రంగులో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చు, మందార చెట్లను ఇంటి దగ్గర పెంచితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే, అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు.

మన పెద్దవాళ్లు మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెబుతున్నాయి. దేవత వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. పోతన మహాకవి ఇలా ప్రశ్నిస్తాడు, మందార మకరందానికి మాధుర్యానికి అలవాటు పడిన తుమ్మిదలు మరో చెట్టును ఆశిస్తాయా అని ప్రశ్నిస్తాడు పోతన మహాకవి. ఈ మాటను భక్త ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడితో అంటారు. తెలుగు వారందరికీ కూడా ఈ పద్యం తెలుసు నాలుగు కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.