మీకు ఊరికే తల తిరుగుతుందంటే వీటి వల్లే జాగ్రత్త!

తల తిరగడం, అసలు ఎందుకు తిరుగుతుంది, దీనికి కారణాలు ఏమిటి అని మనం పరిశీలిస్తే, ఎక్కువగా బి పి ఉన్న వాళ్ళకి, మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. బీపీ ఉన్న వాళ్లకి అంటే రక్తపోటు ఉన్న వాళ్లకి, సడన్గా బీపీ తగ్గడం వల్ల, మెదడుకు సరఫరా అయ్యే రక్తము మోతాదు తగ్గడం వల్ల, మెదడు కణజాలం ఆక్సిజన్ తగ్గింది, అనే సంకేతము సిగ్నల్ ఆ తల తిరగడం అంటే. సిగ్నల్ ఇస్తుంది అంటే శరీరానికి సంకేతం పంపించింది మెదడు నాకు వచ్చే ఆక్సీజన్ శాతం తగ్గింది, నా రక్తప్రసరణ తగ్గింది, అని కొన్ని సందర్భాలలో, టాబ్లెట్లు బీపీ బాగా 120 80 కంట్రోల్ చేసుకోవాలని కొంత మంది తాపత్రయ పడుతూ ఉంటారు.ఒక ఐదు, పద ఎక్కువ ఉంటే పర్వాలేదు. 120 పైన రీడింగ్ 80 రీడింగ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. తల తిరగడం కనుక కొంచెం ఎక్కువే ఉండాలి కానీ, మరీ తగ్గినప్పుడు తల తిరుగుతుంది.

అలా అని చెప్పి బాగా ఎక్కువగా ఉండి అసలు అంత వరకు బీపీ ఉంది అని తెలవకుండా ఉండేవాళ్ళు, తల తిరుగుతోంది అనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్లగానే ఆయన బిపి చూడగానే 160 /110 ఉంటుంది. అంటే తల తిరగడం అనేది బిపి యొక్క బాగా బీపీ పెరిగినప్పుడు కూడా తల తిరుగుతుంది. అదే మొదటి సంకేతం అవుతుంది. అదే మీకు బీపీ ఉన్నట్లుగా తెలిసే అవకాశం ఉంటుంది. కనుక బి పి తగ్గిన, తల తిరుగుతుంది. బీపీ పెరిగినా కూడా తల తిరుగుతుంది.ఇక మెడ నొప్పికి, ఈ తల తిరగడానికి ఏంటి సంబంధం అంటే, సాధారణంగా 40 45 సంవత్సరాల వయస్సు దాటగానే మెడలో ఉన్న పూసల అరుగుదల ప్రారంభం అవుతుంది. దీన్ని స్పాండిలైటిస్ అంటాము. ఈ మెడలో ఉండే పూసల మధ్యలో నుంచి కుడి పక్కన ఒక రక్తనాళం, ఎడమ పక్కన ఒక రక్తనాళం, మెదడు కి, చిన్న మెదడు కి, పెద్ద మెదడు లో వెనక భాగానికి రక్తం సరఫరా చేస్తాయి.

ఈ పూసలు ఎప్పుడైతే అరిగి పోయాయో, స్పాండిలైటిస్ వచ్చిందో, మెడనొప్పి వచ్చిందో, ఆ రక్తనాళాల మీద ఒత్తిడి వచ్చి రక్తనాళాల్లో రక్తప్రసరణ తగ్గి చిన్న మెదడుకు, పెద్ద మెదడు లో వెనక భాగానికి బాగా రక్త సరఫరా తెగిపోయే, ఇలా కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడం అనేది మెదడు లో ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే, చిన్న మెదడు. చిన్న మెదడు వైద్య పరిభాషలో ఉంటాము. ఎప్పుడైనా సరే జబ్బులు వచ్చినా, రక్తసరఫరా తగ్గి ఈ రకంగా తల తిరగడం అనేది జరుగుతుంది.ఇంకా కొన్ని సందర్భాలలో షుగర్ ఉన్న వాళ్ళకి, స్థూలకాయం ఉన్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినే వాళ్ళకి, ఈ మెడ ముందు భాగాన కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి రక్తనాళాలు ఉంటాయి. వాటిని కెరోటిడ్ ధమనులు అంటారు, ఈ కెరోటిడ్ ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే కెరోటిడ్ ధమనుల్లో మెదడుకు రక్త సరఫరా చేస్తాయి. ఈ కెరోటిడ్ ధమనులు ఎప్పుడు అయితే కొవ్వు పేరుకు పోయింది. మెదడుకు రక్త సరఫరా తగ్గగానే ఆక్సిజన్ తగ్గగానే కళ్ళు తిరుగుతాయి. ఇది మెదడుకు రక్తము తగ్గుతోంది అనే సంకేతం ఇచ్చేదే. ఈ తల తిరగడం అనేది.