మీ చేతిలో ఈ రేఖ‌లు ఉంటే మీకు తిరుగేలేదు

మనిషి జీవితంలో అదృష్టానికి అరచేతికి సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికి అరచేతిలోనే అదృష్టం ఉంటుందని అష్ట సాముద్రికంలో చెప్పారు. అరచేతిలో ఎవరికైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి. అయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది, అలాగే అర చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, మన అదృష్టం ఎలా ఉంటుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే అరచేతిని పరిశీలించినట్లయితే చూపుడి వేలు కింది భాగాన్ని గురు స్థానం అంటారు.ఈ గురు స్థానానికి చాలా శక్తి ఉంటుంది. ఎక్కడైనా సరే అరచేతిలో ఇంటు మార్క్ ఉన్నట్లయితే, క్రాస్ మార్కు ఉన్నట్లయితే అవి చెడు ఫలితాలను కలుగజేస్తుంది. కానీ చూపుడువేలు కింది భాగంలో ఉన్న గురుస్థానంలో మాత్రం ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తుంది. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగ…ఈ చూపుడు వేలు క్రింద ఉన్నటువంటి గురుస్థానంలో కొంతమందికి అర్ధ చంద్రాకారంలో రేఖ ఉంటే దానిని సాలమన్ రేఖ అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎవరికైనా సరే జీవితంలో కావలసింది ఏంటి అంటే తినడానికి ఎప్పుడూ లోటు రాకూడదు, ఉండడానికి ఎప్పుడూ సమస్యలు రాకూడదు.

మీకు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా ఉండాలి అంటే మీ బొటన వేలు మీద ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండాలి. దానినే వడ్లగింజ గుర్తు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక కన్ను గుర్తు కన్ను గుర్తు ఎలా ఉంటుందో అలా బొటనవేలు మీద ఉండాలి. ఆడవాళ్లకు ఎడమ చేయి బొటనవేలు చూసుకోండి, ఎవరికైనా సరే బొటనవేలు మీద ఎలా కన్ను ఆకారం లో గుర్తు ఉంటే దానిని వడ్లగింజ రేఖ అంటారు. వాళ్ళకి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే తినడానికి మాత్రం ఎప్పుడూ లోటు ఉండదు. ఉండడానికి లోటు ఉండదు. జీవితం అనేది తప్పకుండా హాయిగా గడిచిపోతుంది, అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.అలాగే ఎవరికైనా సరే కోటీశ్వరులు అయితే ఎటువంటి ప్రత్యేకమైన గుర్తు కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలుసా.. మన చేతి వేళ్ళ లో ఉంగరం వేలు అంటారో ఈ ఉంగరం వేలుని రవి స్థానము అంటారు. అంటే మన చేతి వేళ్ళ లో ఒక వేలు గ్రహాలలో ఒక్కొక్కసారి అని తెలియజేస్తుంది. ఓంకారం వేలుని రవి స్థానము అంటారు, అంటే నవగ్రహాలలో సూర్యుడి స్థానం. ఈ ఉంగరం వేలు కిందిభాగంలో, ఎవరికైనా సరే చతురస్త్రం ఉన్నట్లయితే వాళ్లు తప్పకుండా జీవితంలో కోటీశ్వరులు అవుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి చూసుకోండి, మగవాళ్లు అయితే కుడిచేయి చూసుకోండి.మీ ఉంగరం వేలు క్రిందిభాగంలో చూసుకోండి.

ఉంగరం వేలు కింది భాగాన్ని రవి స్థానం అంటారు. కింద ఎక్కడైనా సరే ఉంగరం వేలు కింది భాగం మొత్తం చూసుకోండి. ఆ మొత్తం భాగంలో ఎక్కడైనా సరే ఒక చతురస్రం, ఒక స్క్వేర్ ఉంటే మాత్రం జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు.స్క్వేర్ లేని వాళ్ళు బాధ పడక్కర్లేదు, ఈ రవి స్థానం కింద నిలువు రేఖ ఉన్న కూడా కోటీశ్వరులు అవుతారు. దానినే రవి రేఖ అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎవరికైనా చేతిలో ఉంగరం వేలుకి శక్తి చాలా ఉంటుంది. మీ ఉంగరం వేలు కింద నిలువు రేఖ ఉన్న కోటీశ్వరులు అవుతారు. దానిని రవి రేఖ అంటారు లేదా ఉంగరం వేలు కింద చతురస్త్రం ఉన్న కూడా మీరు కోటీశ్వరులు అవుతారు. అందుకే ఉంగరం వేలు కింది భాగం అందరూ జాగ్రత్తగా చూసుకోండి.నిలువు రేఖ ఉన్న, చతురస్త్రం ఉన్న మీరు కోటీశ్వరులు అయి తీరుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ఎవరికైనా సరే దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చిటికెనవేలు తెలియజేస్తుంది. మీరు చిటికెన వేలు కింది భాగంలో చూసుకోండి, చిటికెన వేలు కిందిభాగంలో మీకు ఒక అడ్డు రేఖ కనిపిస్తుంది. కొంతమందికి రెండు మూడు అడ్డురేఖలను ఉంటాయి. వాటిలో వివాహ రేఖ లు అంటారు.

రెండు మూడు అడ్డురేఖలను ఉంటే రెండు మూడు వివాహాలు అని సందేహం కలగవచ్చు కానీ అది కాదు రెండు మూడు రేఖలు ఉన్నప్పటికీ ఏ వయసులో వివాహం అవుతుందో ఒక్కొక్కరేఖ తెలియజేస్తుంది. అంటే మొదటి రేఖ దగ్గర వివాహం అవ్వకపోతే కొంతకాలానికి రెండవ రేఖ సమయానికి వివాహం అవుతుంది. అయితే మీ మ్యారేజ్ లైఫ్ మీ దాంపత్య జీవితం బాగుంటుందా, బాగోద, గొడవలు వస్తాయా, అనుకూలంగా ఉంటుందా అనే విషయం ఈ చిటికెనవేలు తెలియజేస్తుంది.చిటికెన వేలు క్రింద ఉన్నటువంటి అడ్డురేఖలను చూసుకోండి. ఆ అడ్డు రేఖ గనుక ఎలాంటి చీలికలు లేకుండా ఉన్నట్లయితే మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే చిటికెన వేలు క్రింద ఉన్నటువంటి అడ్డు రేఖ నీ మ్యారేజ్ లైఫ్ అనే పేరుతో పిలుస్తారు. దీనినే వివాహ రేఖ అంటారు. అది ఎప్పుడు కూడా చీలి ఉండకూడదు. చీలే ఉంటె గొడవలు వస్తాయి. చేతుల లో ఉన్నటువంటి రేఖలలో ధన రేఖకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ధన రేఖ అదృష్ట రేఖ అనే పేరుతో పిలుస్తారు. మన చేతిలో మణికట్టు అంటారు..ఈ మణికట్టు దగ్గర నుంచి అదృష్ట రేఖ అనేది మొదలయ్యి వేళ్ల వరకు వెళ్ళిపోతుంది. దానినే అదృష్ట రేఖ లేదా ధన రేఖ అనే పేరుతో పిలుస్తారు. ఈ దన రేఖ అనేది కొంత మందికి మణికట్టు నుండే ప్రారంభమవుతుంది మరికొంతమందికి చేతి మధ్య భాగంలో నుంచి ప్రారంభం అవుతుంది. ఇంకొంతమంది చివరి భాగంలో వస్తుంది ఎవరికైతే ఈ ధనరేఖ అనేటటువంటి ది ఈ మణికట్టు నుంచి ప్రారంభం అయ్యే వేళ్ల వరకు స్ట్రైట్ గా వెళుతుందో వాళ్లకి చిన్నప్పటినుండే ధనానికి లోటు ఉండదు. పుట్టుకతోనే ధనవంతులు గా ఉంటారు.