మే 14 శని త్రయోదశిలోపు ఈ కథ వింటే చాలు 1గంటలో మీ సుడి తిరిగి కుభేరులు అవుతారు….

శని దేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడు చాలా మంచివాడు, శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మ భద్రత కు కట్టుబడి ఉంటాడు. అశుభ దృష్టి ఉన్నవారిని భక్తితో కొలిస్తే శని దేవుడు ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును త్రయోదశి అంటారు. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి కావడం వలన అందుకే శని త్రయోదశి కి ఈ అంతటి విశిష్టత ఏర్పడింది. ఇంతటి విశిష్టత కలిగిన శని త్రయోదశి లోపు ఏం చేసినా చేయకపోయినా ఈ పవిత్ర కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అంతేకాకుండా మీకు ఐశ్వర్యం కలుగుతుంది మీ పాపాలను తొలగింప చేసుకునే ఆ కథ ఏమిటో తెలుసుకుందాం!పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో లో నందిని అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు.

అతను చాలా ధనవంతుడు, ఇతను ధనధాన్యాలు ,భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించ కుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది, అది తెలుసుకున్న నంది అనే శివ భక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివ భక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్నా ధనం తో అక్కడ గుడి కట్టాలనే నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడునీ నిత్యం పంచామృతాలతో, పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కులవృత్తి ప్రకారంగా జంతువులను, పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళుతూ ఆ అడవి లోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయారు ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్లి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తి భావం కలిగింది.

శివుని పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకుని అక్కడ ఉన్న నా మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివ భక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగం పై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితో తెచ్చిన నీటితో శివుని అభిషేకించి ,మారేడు దళంతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివునికి నివేదించి ప్రదక్షిణాలు చేసి శివుని నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోనే గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి తనతోపాటు ఒక బ్రాహ్మణుడునీ కూడా తీసుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగానే అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారు అని నంది బాధ పడి ,ఆ స్థలాన్ని శుభ్రం చేసిz పూజ ముగించుకుని తన గృహానికి వెళ్లి పోతాడు.