మొలకెత్తిన వెల్లుల్లిని తింటే… ఎన్నో ఊహించని ప్రయోజనాలు… అసలు నమ్మలేరు

వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండుట వలన… రోజు 2 వెల్లుల్లి రెబ్బలు తినమని నిపుణులు చెప్పుతూ ఉంటారు. అందుకే మనలో చాలా మంది వెల్లుల్లిని తింటూ ఉంటారు. అయితే వెల్లుల్లి పాయ మొలక వస్తే మాత్రం పారేస్తూ ఉంటాం. వీటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఈ విషయం తెలియక చాలా మంది మొలక వచ్చిన వెల్లుల్లిని పాడేస్తూ ఉంటాం.

అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకుంటే అసలు పాడేయరు. ఆలా మొలక వచ్చిన వెల్లుల్లిపాయలో మాములు వెల్లుల్లిపాయలో కన్నా ఎక్కువ గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ క్రియాశీలంగా ఉంటాయని నిపుణులు చెప్పుతున్నారు.లేత పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోలిస్తే మొలక వచ్చిన పాయలలో రకరకాల మెటాబోలెట్స్ అధికంగా ఉంటాయి. సాధారణంగా ఈ మెటాబోలెట్స్ గింజల మొలకల్లో కనిపిస్తాయి.

మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలెట్స్ కాపాడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా అద్భుతంగా పనిచేస్తాయి.మాములు వెల్లుల్లి పాయలు కన్నా మొలక వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తాయి. కొలస్ట్రాల్, బిపి ని తగ్గించటంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా ఇలా తీసుకోవటం చాలా మంచిది.

ఈ మధ్య కాలంలో మ‌తిమ‌రుపు అనేది చాలా సాదారణంగా కనిపించే సమస్య. అయితే మొల‌కెత్తిన వెల్లుల్లిని తీసుకుంటే మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క శ‌క్తీ పెరుగుతుంది. ఇక మొల‌కెత్తిన వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల పక్షవాతం త్వ‌ర‌గా నివార‌ణ అవుతుంది. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు కూడా పరార్ అవుతాయి. కాబట్టి మొలక వచ్చిన వెల్లుల్లిని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.