ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండులో ఉన్న ఆ రహస్యం తెలిస్తే…అసలు వదలరు

ఈ సీజన్ లో ఇప్పుడు ఎన్నో రకాల పండ్లు వస్తున్నాయి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించే పండ్లు ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి. సీజన్ లో దొరికే పండ్లను తింటే ఆ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ సీజన్ లో దొరికే ప్లమ్ పండులో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఈ పండ్లు డ్రై గా కూడా లభ్యం అవుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో విషాలను బయటకు పంపటమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్ లేకుండా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.ఈ రోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. వారు ఈ పండును రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ పండ్లలో యాంతోసియానిన్స్ సమృద్దిగా ఉండటం వలన కాన్సర్ రాకుండా కాపాడతాయి. నోటి కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ రాకుండా చేస్తాయి. చిగుళ్లు పాడవకుండా కాపాడతాయి.ఈ పండ్లలోని ఐరన్… రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది.

ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా వినపడుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ పండు తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. చర్మ కణాల్ని వృద్ధి చేస్తాయి. ఈ పండు తినటం వలన ముడతలు తొలగిపోయి చర్మం యవ్వనంగా కనపడుతుంది.ప్లమ్‌లలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ప్లమ్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని తిరిగి బాగుచేస్తాయి.

కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఒక పండు తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా చేస్తుంది.కాబట్టి సీజన్ లో వచ్చినప్పుడు తాజా పండ్లను తినండి. సీజన్ కానప్పుడు డ్రై గా దొరికే పండ్లను తినండి. ఇవి online store లోనూ super market లలో విరివిగా లభ్యం అవుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పండ్లను అసలు మిస్ చేసుకోవద్దు. మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తింటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి.