రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువ తాగుతున్నారా….

మనిషి ప్రతి అవసరాన్ని తీర్చేది నీరు.నీరు లేనిదే ఏ పని పూర్తికాదు, వాటర్ తాగకుండా కూడా ఏ మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. శరీరంలో మరణాలను బయటకు పంపాలన్న, ఆరోగ్యం ఉండాలన్న, నీరు ఎంతో అవసరం అవుతుంది. కనీసం రోజుకు మూడు లీటర్ల నీళ్లు అయినా తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే నీటిని ఎలా తాగాలి అనే దానిపై ఎన్నో క్లారిటీలు వచ్చినా, కొన్ని అపోహలు మాత్రం పోవడం లేదు. తాజాగా మరో విషయం చేర్చకు వస్తుంది,

రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదని చెప్తున్నారు. మరి రాత్రిపూట నీటిని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. నీరు ఎంత తాగితే అంత మంచిది కానీ, తాగే సమయంలోనే తాగాలి అప్పుడు శరీరాన్ని కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే అందంగా ఉండడంలో కూడా నీరు ముఖ్యపాత్ర వహిస్తుంది. నీరు తీసుకుంటే చర్మం తేమగా హైడ్రేట్ అవుతుంది. కాంతివంతంగా తయారవుతుంది,

ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం వల్ల చాలా బెటర్. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా నీటిని తాగకూడదు, షుగర్ వ్యాధి రక్తపోటు గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.నీరు ఎక్కువగా తాగకూడదు, రాత్రి పూట నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి, లేదంటే నిద్ర సరిగా పట్టదు అలాగే మూత్ర విసర్జన ఎక్కువ చేయాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగడం వల్ల, నిద్ర కు ఆటంకం వస్తుంది.

మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది,పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదు. అంతే కాకుండా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పడుకునే అరగంట ముందు ఓ గ్లాస్ వాటర్ తాగాలి, మధ్యలో బాగా దాహం అనిపిస్తే అప్పుడు తాగాలి. రాత్రిపూట మితంగా వాటర్ ని తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మలినాలు అన్ని బయటకు పోతాయి. అలాగే చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది, శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి..