రోజుకు ఒక్క గ్లాస్ ఈ రసాన్ని తీసుకోండి… కిడ్నీ స్టోన్ సమస్యలకు చెక్ పెట్టండి…!

Banana Stem Juice : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో పోషకాలు కలిగిన పండ్లను తీసుకుంటూ ఉంటాము. అయితే పోషకాలు అధికంగా ఉండే పండ్లలో ఒకటి అరటి పండు కూడా. కేరళ రాష్ట్రంలో అరటి తొట్టెల నుండి తీసిన నీటిని అధికంగా వాడతారు. దీనిని ఇలా తీసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి వారికి కిడ్నీ స్టోన్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అని, అలాగే రాయి ఉన్న కూడా దాని ప్రభావం అనేది తొందరగా తగ్గుతుంది అని అంటున్నారు. ఈ నీటిని డైరెక్టుగా కాకుండా ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలా చేయడం వలన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది.

ఒక రోజులోనే కిడ్నీ స్టోన్ అనేది పొడిగా మారుతుంది. అలాగే బ్లాడర్ నుండి బయటకు వచ్చేస్తుంది. అరటికాండం శరీర కణాల నుండి చక్కెర మరియు కొవ్వులను కూడా రిలీజ్ చేస్తుంది. దీనిలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అరటి కాండం రసం శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపుకు చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ మరియు మలబద్ధకం లేక ఎసిడిటీ లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది…

అరటి కాండంలో విటమిన్ b6 ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ కౌంటర్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనిలో పొటాషియం కూడా ఉన్నది. అంతేకాక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు సమస్యలను కూడా నియంత్రించేందుకు ఇది ఎంతో ఉత్తమమైన మార్గం. శరీరంలో అరటి కాండం రసం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా పని చేస్తుంది. కావున మధుమేహ రోగుల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మీకు కూడా కీడ్ని స్టోన్ సమస్య ఉన్నట్లయితే ఈ రసంలో యాలకుల పొడి వేసుకొని తీసుకోండి.

ఇలా తీసుకోవడం వలన కిడ్నీలోని రాళ్ళను బయటకు పంపించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు అరటి కాండం రసంలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. అరటి కాండం రసం మీ కాలే యాన్ని ఏడు రోజులలోనే క్లీన్ చేస్తుంది. ఈ రసం అనేది అన్ని రకాల పేగు అడ్డంకులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బెల్లి ఫ్యాట్ ను కూడా వెంటనే నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తహీనత మరియు అధిక కొలెస్ట్రాల్ లేక అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కూడా ఈ రసం ఎంతో ఉపయోగంగా ఉంటుంది…