రోజు పెరుగు, మజ్జిగ తాగే వారికి పక్కా తెలియాలి

మజ్జిగ తాగితే మంచిదేనా, అసలు తాగాల అక్కర్లేదా, దాని వల్ల లాభ నష్టాలు ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో అన్నం తినాలంటే మజ్జిగ కంపల్సరి ఉండాలి.ఎందుకంటే అన్నం తినడానికి కూరలేని రోజులు పూర్వం రోజుల్లో,అందుచేత చాలా మంది ఉన్నప్పుడు అందరికీ పెరుగు పోయాలంటే ప్రతి ఇంట్లో పెరుగు అంత ఉండదు చాలదు, అందుకని పలుచగా మజ్జిగ చేసుకుని తాగేసేవారు,కొంతమంది ఆహారం తిన్నప్పటికి మజ్జిగ రెండు గ్లాసులు భోజనంతో పాటు తీసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది, కానీ మజ్జిగ వాడితే మంచిదా, పెరుగు వాడితే మంచిద, అసలు వాడకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి.

మామూలుగా పెరుగు తోడు పెట్టినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు పెరుగు పులిసే కొద్ది సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతూ ఉంటుంది. ఈ ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మన పేగులలో, హెల్పఫుల్ బ్యాక్టీరియాలు గా పిలవబడుతుంది. దీన్ని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటారు. ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరుగు తోడు కున్నప్పుడు పెరుగు కొద్దిగా పులిసే కొద్ది ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు పుల్ల మజ్జిగ మంచిది, పుల్ల మజ్జిగ తో సద్ది అన్నం తినడం మంచిది అనేది వాస్తవమే, ఇది సైంటిఫిక్ ప్రూవ్ అయిన విషయమే కానీ, మనకి మజ్జిగ తింటేనే వస్తుందా పెరుగు తింటే రాదా అని ఆలోచిస్తే, పెరుగుతున్న వస్తాయి పూర్వపు రోజులలో ఇంట్లో చాలా మంది ఉండడం వలన పెరుగు చాలదు కాబట్టి అందరికీ మజ్జిగ కలపడం అలవాటు అయ్యింది.

అందుకని వారు ఏమి చెప్పేవారు వెనుకటి రోజుల్లో అంటే మజ్జిగ చలవ చేస్తుంది, పెరుగు వేడి చేస్తుంది అని చెప్పారు, ఇది తప్పు ఎందుకు తప్ప అంటే ఆ రోజుల్లో ఇంట్లో ఎక్కువ మంది ఉండేవారు, అందువల్ల అందరూ పెరుగు తాగడం కుదరదు కాబట్టి మజ్జిగను కలిపేవారు, మజ్జిగ చలువ పెరుగు వేడి అనేది చెప్పేవారు. మజ్జిగ చలువ వేడి అనేది యదార్థం కాదు, ఈ రోజుల్లో మరి మజ్జిగ త్రాగవచ్చా, మీరు పెరుగు వాడుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ అన్నం తినము కాబట్టి మనం తినే అన్నానికి ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు పెరుగు గ్లాస్ వాటర్ కలిపితే మజ్జిగ అవుతుంది, ఆ నీళ్లను మీరు ఆహారంతోపాటు నింపడం వల్ల డైజెస్టివ్ జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి డైల్యూట్ అయిపోతాయి. అనవసరంగా డైల్యూట్ చేయడం ఎందుకు. మోర్ ఆసిడ్ మీ పొట్ట ప్రొడ్యూస్ చేసి ఎక్కువ సేపు ఆహారాన్ని పొట్ట లో ఉంచి డైజేషన్ చేయవలసిన అవసరాన్ని మీరు కలిగిస్తున్నారు తినేటప్పుడు మజ్జిగ ఎక్కువ తాగేసి.

అందుకని నీళ్ల డైట్ భోజనంతోపాటు ఉండటం మంచిది కాదు, మజ్జిగ అంటే నీళ్ల డైట్ అది. అందుకని మజ్జిగ మానేసి ఒక కప్పు పెరుగు వేసుకుని తినండి కానీ, ఎక్కువ పెరుగు తినవలసిన అవసరం ఏమీ లేదు మనకి. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా లో పెరుగు తింటేనే వస్తాయని కాదు, కొంచెం పెరుగు ద్వారా వచ్చే బ్యాక్టీరియాలు డెవలప్ అవ్వాలి అంటే, మీరు మీ ప్రేగుల వాతావరణం శుభ్రంగా ఉండాలి. తియ్యటి పెరుగు లో కంటే కొంచెం పులిసిన పెరుగు లో బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి హెల్ప్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి పెరగడానికి రక్షణ వ్యవస్థకి పేగుల వాతావరణానికి చాలా మంచిది. ఈ మంచి బ్యాక్టీరియా వాతావరణం ప్రేగుల్లో పెరిగితే చెడ్డ బ్యాక్టీరియా ని చంపేస్తుంది. అందుకని మీ పేగులో రక్షణవ్యవస్థ పెరిగి దాడిచేసి క్రీముల్ని చంపడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అందుకని పెరుగు రోజు కొంచెం తినండి, కానీ మజ్జిగ అనేది వద్దు వేడి తగ్గాలి అంటే నాలుగు నుండి ఐదు లీటర్లు ఎక్కువగా వాటర్ తాగండి..