టెస్ట్ కి ఎప్పుడు వెళ్ళాలి…..

ప్రస్తుతం ఇండియా మొత్తంలో కరోనా కేసులు 3. 3 లక్షల కేసులు నమోదయ్యాయి, లక్షణాల విషయానికి వస్తే కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి,అంటే ఇంతకు ముందు చూసిన కరోనా కి ఇప్పుడు ఉన్న కరోనా కి రెండు ఒకటేనా అనిపించేలా తేడాలు ఉన్నాయి, ఎందుకంటే ఇంతకు ముందు మనకు వాసన పోవడం,రుచిపోవడం దాంతో పాటు దగ్గు, జలుబు, జ్వరం రావడం , వచ్చిన పదిమందిలో ఇద్దరి కంటే సీరియస్ అవ్వడం జరిగేది. ఇప్పుడు విపరీతమైన చలి, జ్వరం, జ్వరం చలి రెండు మూడు రోజులపాటు ఉండడం.

దాంతో పాటు జలుబు ఎక్కువగా గొంతు నొప్పి, జ్వరం తగ్గినా కూడా గొంతు నొప్పి రెండు మూడు రోజులపాటు ఉండడం ఇలాంటి లక్షణాలతో ప్రస్తుతం ఓమీక్రాన్ వ్యాపిస్తుంది, ఆల్మోస్ట్ ఏ మెడిసిన్స్ వాడకపోయినా కూడా ఒక వారం రోజుల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రికవరీ అవుతున్నారు. కాకపోతే అందరూ రికవరీ అవుతున్నారని కాదు, అలాగే అస్సలు హాస్పిటల్ కి వెళ్లట్లేదు అని కూడా కాదు, కొంత మంది వెళ్తున్నారు దానికి ఓమి క్రాన్ లో కొంతమంది అలా అవ్వడం కారణమైతే, డెల్టాలో కూడా మనకు కంటిన్యూ అవ్వడం మరొక కారణం. అలాగే మనం డెల్టా, ఓమి క్రాన్ లో లో ఏది వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇది కొంచెం కష్టతరమైన విషయమే, మామూలుగా మనం దీని కోసం రాపిడ్ టెస్ట్ చేస్తే తెలియదు, ఇది చేస్తే రెండు పాజిటివ్ వస్తాయి.అదేవిధంగా ఆర్ టి పి సి ఆర్ కూడా మామూలు ఆర్ టి పి సి ఆర్ చేస్తే తెలియదు, ట్రిపుల్ యాంటీజన్ ఆర్ టి పి సి ఆర్ అని చేస్తారు.

అయితే టెస్ట్ చేసినప్పుడు మనం వైరస్ తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఆర్ టి పి సి ఆర్ చేసినప్పుడు సిటీ వ్యాల్యూ అని ఒకటి వస్తుంది, ఈ సిటీ వ్యాల్యూ అనేది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఆర్ టి పి సి ఆర్ లో వైరస్ తీవ్రత ఎలా చెప్తారు అంటే సుమారుగా 20 వచ్చిన వారి కన్నా 15 వచ్చిన వారికి సివియర్ అని చెప్తారు, ఇది ఓమి క్రాన్ కి వర్తించదు ఎందుకంటే ఓమి క్రాన్ లో డెల్టా కన్నా ఎక్కువ త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి, అంటే గొంతు లోనూ గొంతు చుట్టూ వైరస్ ఎక్కువగా ఉంటుంది, అందుకని తక్కువ సిటీ వ్యాల్యూ వచ్చిన కూడా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే గొంతులో ఎక్కువగా స్ప్రెడ్ అయి లంగ్స్ ని ఎఫెక్ట్ చేయదు. కాబట్టి థర్డ్ వేవ్ లో సెకండ్ వేవ్ లాగా కాకుండా సిటీ వ్యాల్యూ పై అసలు ఆధారపడకూడదు, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా ఐ సి ఎం ఆర్ పూర్తిగా చెప్పింది సిటీ వ్యాల్యూ పై ఆధారపడి ట్రీట్మెంట్ తీసుకోవద్దు అని.