వారం రోజుల్లో ఈజీగ బరువు పెరగాలంటే ఈ పద్ధతి ఫాలో అవండి.

బరువు తగ్గడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట అన్నిచోట్లా యోగ, జిమ్ డైట్ ప్లాన్స్ అని చాల ఒప్షన్స్ ఉన్నాయ్ కానీ బరువు పెరగడానికి మంచి పద్దతిలో సలహాలు దొరకడం కష్టం. బయట దొరికే జుంక్ ఫుడ్ తినడం వలన బరువు ఈజీగా పెరుగుతారు కానీ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. మంచి ఆహారం తీసుకుంటూ బరువు ఎలా పెరగటం తెలుసుకుందాం. బరువు తక్కువ సమస్య ఎక్కువగా స్కూల్, కాలేజీ వెళ్లే పిల్లలకు, కొంత మంది జాబ్ చేసే వారిలో ఇంకా కొన్ని సమస్యల వలన బరువు తగ్గినవారు ఉంటారు.

బరువు పెరగాలంటే ముఖ్యంగా మూడు పనులు బాగా జరగాలి. మోషన్ ఫ్రీగా రెండు సార్లు అవ్వాలి. ఇలా అవ్వడం వలన ఆకలి పెరుగుతుంద. తిన ఆహారం బాగా జీర్ణం అవుతుంది. తినే ఆహారం కూడా బాగా నమిలి తినాలి మరియు కొంచెం ఎర్లీ టైం లో తింటే అరుగుదల మంచిగా ఉంటుంది. బరువు పెరగాలంటే పొద్దున్న నానబెట్టిన ఒక పెద్ద కప్ పల్లీలు, ఒక చిన కప్ పచ్చి కొబ్బరి ముక్కలు లేదా తురుము తినండి దాంట్లో టేస్ట్ కోసం కొంచెం బెల్లం కలుపుకోవచ్చు. ఒక కప్ ఏవైనా మొలకలు తీసుకోండి. ఇలా చేయటం హై ఫైబర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ బాగా లభిస్తాయి.

మధ్యాహ్నం12-1 మధ్యలో అన్నం మంచిగా కూరలు ఎక్కువగా తినండి. పప్పు కూర కూడా ఉండేటట్టుగా చూసుకోండి. సాయంత్రం 4-5 మధ్యలో ఏవన నానపెట్టిన పల్లీలు, కొబ్బరి తురుము లేదా నానబెట్టిన పుచ్చ, గుమ్మడి, పొద్దుతిరుగుడు పప్పులు లేదా బాదాం పిస్తా ఏవైనా కొన్ని డేట్స్ బననా లేదా జమ పండ్లు లేదా సీసొనాల్ ఫ్రూప్ట్స్ తినండి. సాయంత్రం కూడా అన్నం 7. 30 లోపే తినేసేయాలి. ఇలా చేయటం వలన తొందర తిరిగి ఆకలి పెరుగుతుంది. అపుడపుడు పండ్ల రసాలు తాగాలి. ఇలా చేస్తూ వాటర్ కూడా 4 లీటర్ వరకు తాగాలి.