నటుడు చంద్రమోహన్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

1943 సంవత్సరం మే నెల 23వ తేదీన చంద్రమోహన్ జన్మించారు.కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల ఆయన స్వస్థలం కాగా రంగులరాట్నం మూవీతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన.

ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.చంద్రమోహన్ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో సైతం నటించి తన నటనతో మెప్పించారు. పదహారేళ్ల వయస్సు, సిరిసిరిమువ్వ సినిమాలకు చంద్రమోహన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.చందమామరావే, అతనొక్కడే సినిమాలకు చంద్రమోహన్ కు నంది అవార్డులు వచ్చాయి.కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.యల్ లైఫ్ లో చంద్రమోహన్కు ఇద్దరు కూతుర్లు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్.. ఆ తర్వాత భూములపై పెట్టునడులు పెట్టారని..

ఇప్పుడు వాటి విలువ వందల కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. చెన్నై పరిసరాలలో పలు కాంప్లెక్స్ లతో పాటు హైదరాబాద్ శివారులలోను ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన సింపుల్ గానే ఉంటారు ఆయన గురుంచి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరికీ దానం చేయలేదు. అలాంటి వాటిల్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మంది చెబుతుంటారు. తనకు చెప్పకుండా తన రేమ్యునిరేసన్ నుంచి చెన్నై లోని తెలుగు సంగంకు ప్రముఖ నిర్మత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నేళ్ళపాటు కోపంగా ప్రవర్తించేవారట.ఏది ఏమైనా దాదాపు 100 కోట్లకు పైనే ఉంటుంది అని సమాచారం.