సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ప్రధాన కారణo ఇదే!

సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాద ఘటన సంభవించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన రెస్యూ టీమ్, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు గంట గంటకు రెట్టింపుతో పక్కనున్న బిల్డింగ్ లకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన అధికారులు ఏకంగా 12 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 5 గంటల నుంచి రెస్క్యూ టీమ్, రెవెన్యూ అధికారులు శ్రమిస్తున్నా.. మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, రిస్క్యూ టీమ్ సమన్వయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారని, ఇప్పటికే కొంతమందిని రక్షించారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే గంట గంటకు మంటల చెలరేగుతూ పక్కనున్న భవనాలకు వ్యాపిస్తున్నాయి. ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎలాగైన వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. అసలు ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటిన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం.. స్పోర్ట్స్ మాల్ మొత్తం మెటీరియల్ తో నింపేశారని, అందుకే గంట గంటకు మంటలు ఎక్కువ వ్యాపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా వెంటనే ఫైర్ సిబ్బందికి కాస్త ఆలస్యంగా సమాచారం ఇవ్వడం కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇక ఆ మంటల్లో పూర్తిగ కాలిపోయిన ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.