ఘనంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫొటోలు!

ముఖేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థాన్ని వేడుకలా జరిపారు. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న టాప్‌ సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 2019లో వీళ్లిద్దరికీ పెళ్లిచేయబోతున్నట్లు ప్రకటించిన అంబానీ కుటుంబం తాజాగా వారికి నిశ్చితార్థం చేశారు.

ఈ కార్యక్రమం మొత్తాన్ని గుజరాతీ హిందువుల సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. డిసెంబర్ 29న జరిగిన ముందస్తు నిశ్చితార్థం సమయంలో గోల్ దానా(బెల్లం, ధనియాలను పెళ్లికుమార్తె ఇంట్లో పంచడం), చునారీ విధి వంటి ఆచారాలను పూర్తిచేసుకున్నారు. ఈ నిశ్చితార్థం అనంత్ అంబానీ సోదరి ఇషా అంబానీ.. రాధికా మర్చంట్ ఇంటికి వెళ్లి వారందరినీ పెళ్లికుమారుడు ఇంటికి ఆహ్వానించడం ద్వారా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఒక సర్‌ప్రైజ్‌ పర్ఫార్మెన్స్ కూడా చేశారు.

నిశ్చితార్థానికి రాధికా మర్చంట్ గోల్డ్‌ లెహంగా ధరించగా.. అనంత్ అంబానీ బ్లూ కలర్ షేర్వానీని ధరించాడు. ఇంక ఈ కార్యక్రమానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ దంపతుల మొదలు, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ భార్య- కుమారుడు, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, దీపికా- రణ్‌వీర్, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్ ఇలా బాలీవుడ్ లో ఉన్న స్టార్‌ హీరోలు, హీరీయిన్లు అంతా హాజరయ్యారు. ఆంటిలియా మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది.

అనంత్ అంబానీ.. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు. అతను యూఎస్ బ్రౌన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించాడు. చదువు పూర్తైన తర్వాతి నించి నాన్నతో కలిసి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. ఇంక రాధికా మర్చంట్ విషయానికి వస్తే.. ఆమె పారిశ్రామికవేత్త విరెన్ మర్చంట్ కుమార్తె. ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందింది. ఆమెకు భరతనాట్యంలో కూడా ప్రవేశం ఉంది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దగ్గరుండీ ఆమె అరంగేట్రం కార్యక్రమం నిర్వహించారు.