5 గంటల్లో ఫైల్స్ మొలలు పూర్తిగా మాయం ఇక మీ జీవితంలో మళ్ళీ రావు.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కూడా మొలలు వస్తాయి. మలబద్దకం సమస్య ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. గట్టి గట్టిగా దగ్గే వారికి కూడా అర్శమొలలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మలవిసర్జన చేసేటప్పుడు ఎక్కువగా ముక్కేవారు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. మలద్వారంలో నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ నాళాలపై ఒత్తిడి ఏర్పడితే అవి వాచి రక్తంతో నిండి పిలకలుగా మారుతాయి.

అవి ముదిరితే.. అవి మలద్వారం గుండా బయటకు పొడుచుకొస్తాయి. అంతేకాదు మలవిసర్జన సమయంలో అవి తీవ్రమైన నొప్పిని పుట్టిస్తాయి. ఒక్కో సారి ఏకంగా రక్తం కూడా కారుతుంది. పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలోనే పైల్స్ అధికంగా వస్తుంది.

కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి పైల్స్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది. నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం.