60 సెకండ్స్ లో 2 సార్లు కంటే ఎక్కువసార్లు దగ్గుతున్నారా ….

థర్డ్ వేవ్ వైరస్ విజృంభణ చాలా స్పీడ్ గా జరుగుతున్నది, ఎక్కువమంది హాస్పటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రాకుండానే, ఆక్సిజన్ అవసరానికి వెళ్లకుండానే సేఫ్ గా బయట బయట పడుతున్నారని, మంచి విషయాలు వార్తలలో మనం వింటున్నాం, అంత ప్రభావం మన మీద తగ్గడానికి రెండు వాక్సిన్ లను తీసుకోవడం అనేది ప్రధాన కారణం అని చాలామంది తెలియజేస్తున్నారు. ఈ థర్డ్ వేవ్ లో వచ్చిన ఓమి క్రాన్ వైరస్ అనేది ముఖ్యంగా ఈ లంగ్స్ లో దిగువ భాగాలకి ఎక్కువ వ్యాపించకుండా, పై పై భాగాలలో ముక్కు, గొంతు భాగాలలో అక్కడే కొద్దిగా ఇన్ఫెక్షన్ను కలిగిస్తున్నది.

ఈ ఓమి క్రాన్ వైరస్ అనేది శరీరంలోకి వెళ్లిన తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ కలిగినట్లు, ఆ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు తెలియడానికి మనం అనుమానంతో టెస్టులు చేయించుకోవడానికి, గతంలో లాగా వారం పది రోజులు పట్టడంలేదు రెండు మూడు రోజుల్లోనే దాని యొక్క ప్రభావం మనకు లక్షణాల రూపంలో కనిపిస్తాయట. కాబట్టి మనం లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా తక్కువ సమయంలోనే దాన్ని మన శరీరం లోకి వెళ్ళింది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది, ఏమాత్రం జలుబు, దగ్గు, గొంతులో నొప్పి ,తుమ్ములు ఇలాంటి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది.ఇలా ఒకసారి చెకప్ చేయించుకొని పాజిటివ్ వచ్చినా కూడా మీరు ఎవరు భయపడాల్సిన పనిలేదు, గతంలో లాగా నష్టం జరగడం లేదు కానీ అశ్రద్ధ చేయకూడదు.

ఇలాంటి ఓమి క్రాన్ వైరస్ కి ఆల్రెడీ మీరు రెండు రోజుల వ్యాక్సిన్ను తీసుకున్న, బూస్టర్ డోస్ ను తీసుకున్న, యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీ ప్రతిఘటించడం అనేది చేస్తుంది, ఈ లోపు ఇది ప్రమాదకారిగా మారకుండా దాన్ని ఎదుర్కోవడానికి అవి కలిగించిన లక్షణాల నుండి మనం బయట పడడానికి కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది, వీటి నుండి బయట పడడానికి కొంతమంది టాబ్లెట్స్ కూడా వాడుతారు.మరి నేచురోపతి విధానంలో మందులు వాడితే తగ్గే దానికంటే శరీరం చెప్పినట్లు వింటే ఇంకా స్పీడ్ గా తగ్గుతుంది, ఆ లక్షణాలు అనేవి త్వరగా తగ్గడానికి, వైరస్ ను ఎదుర్కోవడానికి మన బాడీ లో రక్షణ వ్యవస్థ 5 -6 టైమ్స్ ఎక్కువగా పనిచేస్తుంది, ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఫాస్టింగ్ అంటే లంకనం అంతా పవర్ ఫుల్ మెకానిజం, మీ శరీరం రుచి ,వాసన, ఆకలి తగ్గిస్తుంది, మనసుకు తినాలనే వాంఛను తగ్గిస్తుంది.

శరీరానికి రెస్ట్ ఇవ్వమని చెబుతుంది మరి ఇలాంటి లక్షణాలలో పెట్టింది అంటే శరీరం లోపలికి వైరస్ వెళ్ళినప్పుడు నేను దాన్ని ఎదుర్కొంటాం నాకు అవకాశం ఇవ్వమని అడుగుతుంది, మరి మీరు అలాంటి సందర్భాలలో ఫాస్టింగ్ చేస్తే చాలా సింపుల్ గా వైరస్ నుంచి బయట పడతారు, అది ఏ వయసు వారైనా సరే ఫాస్టింగ్ చేయవచ్చు, మనం హాస్పటల్లో డాక్టర్ ని ,మందుల ని అశ్రద్ధ చేయమని చెప్పడం లేదు, ముందు మన ప్రయత్నం గా శరీరం చెప్పినట్లు వినడం, ఒక రెండు మూడు రోజులు శరీరం చెప్పినట్లు విని ఫాస్టింగ్ చేస్తే తేలికగా బయటపడవచ్చు, ఈ మూడు రోజులు మీరు కచ్చితంగా ఆహారం తీసుకోకుండా, తేనీరు, కొబ్బరినీళ్లు తీసుకుంటూ సుమారు రోజుకు 4 నుండి 6 సార్లు తీసుకుంటే సరిపోతుంది , కేవలం ద్రవ ఆహారం తీసుకుంటూ జీర్ణవ్యవస్థకు పనిలేకుండా హనీ వాటర్ అనేవి డైరెక్టుగా బ్లడ్ లోకి లేకుండా వెళ్లి పోతాయి.