మజ్జిగ తాగేవారు చూడండి….

నిమ్మకాయ మజ్జిగను అన్ని సీజన్లలో వాడినా వేసవిలో మాత్రం దాని వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ మజ్జిగ నిమ్మకాయ కలిపి దాంట్లో ఉప్పు కూడా వేయాలి ఎందుకంటే వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది. చెమట ద్వారా సోడియం క్లోరైడ్ ఆవిరి అవుతాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆడ్ చేయాలి, అయితే బీపీ ఉన్నవారు మాత్రం ఉప్పు లేకుండా త్రాగాలి. ఈ నిమ్మకాయ మజ్జిగ లో విశేషంగా కొన్ని గుణాలు ఉన్నాయి, నీళ్ల లో సహజసిద్ధంగా ఉండే మినరల్స్ ఉంటాయి,నిమ్మకాయ లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్-సి వల్ల చర్మం ఫ్రెష్ గా ఉంటుంది, చర్మం పొడిబారకుండా కాంతి వంతంగా ఉంటుంది, ఈ విటమిన్ సి వల్ల వెంట్రుకలు కూడా నిగనిగలాడుతూ నల్లగా, పొడుగ్గా ,ఒత్తుగా ఉంటాయి.

ఏదైనా చిన్న గాయం అయితే నిమ్మకాయలో ఉండే విటమిన్-సి వల్ల తొందరగా గాయం మానుతుంది, విటమిన్ సి కి కి రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంది, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ రాకుండా విటమిన్-సి కాపాడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ సి శరీరంలో ఉత్పన్నమయ్యే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క మోతాదును తగ్గించి క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతుంది, విటమిన్-సి వాడడం వల్ల మహమ్మారి రాకుండా ఉండడం వచ్చిన వారికి త్వరగా తగ్గడం, వచ్చిన వారికి కూడా తొందరగా కోలుకోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది, విటమిన్-సి వల్ల దంతం పక్కన ఉండే చిగుళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటూ చిగుళ్ల నుండి రక్తం కారకుండా, చీము కారకుండా చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇక ఉప్పును బిపి లేనివారు, వేసవిలో నిమ్మకాయ, ఉప్పు ,మజ్జిగ వేసింది తాగితే వాళ్లు వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు, వడదెబ్బ తగిలిన వారికి నిమ్మకాయ ,మజ్జిగ ఇస్తే వడదెబ్బ నుండి త్వరగా కోలుకుంటారు. శ్రామిక జీవులు ,ఎండలో పని చేసేవారు ,రోడ్ల నిర్మాణం చేసేవారు, ఉపాధి హామీ ,వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ ఎండలో పనిచేస్తారు, వీరందరికీ నిమ్మకాయ మజ్జిగ చాలా శ్రేయస్కరం, దీంట్లో కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు, ఈ కరివేపాకు లో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి, కొంతమంది కొత్తిమీర ,పుదినా లాంటివి కూడా సువాసన కోసం ఉపయోగిస్తారు. వేసవి కాని కాలంలో కొంతమంది ధార్మిక సంస్థలు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహిస్తారు.

మంచినీళ్ల చలివేంద్ర మే కాకుండా అందరికీ కూడా మజ్జిగ ఇవ్వడం అనేది ప్రతి సీజన్లో మజ్జిగ చలివేంద్ర లను నిర్వహిస్తారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా నిర్వహించడం ద్వారా వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య తగ్గుతుంది, వడదెబ్బ బారినపడి ఆస్పత్రిలో చేరే బదులు ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలే చలివేంద్రం పెట్టి మంచి నీళ్లు ఇచ్చే బదులు చల్లటి నీళ్లు ఇచ్చే బదులు ,మజ్జిగ చలివేంద్రాలు పెట్టి ఇ అందులో నిమ్మకాయ ఉప్పు కలిపి ఇవ్వడం ద్వారా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా బాహ్య వాతావరణం గ్లోబల్ వార్మింగ్ వల్ల బాహ్య ఉష్ణోగ్రత పెరిగి పోయి కృష్ణ తాపానికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా వృద్ధులు ఈ వేడికి తట్టుకోలేరు, వృద్ధులకు ఈ మజ్జిగ ఇవ్వడం అనేది చాలా ఆరోగ్యకరం.