ప్రతి రోజు ఒకే ఒక స్పూన్ తీసుకుంటే కీళ్లనొప్పులు ,డయాబెటిస్ ,అధికబరువు ,అలసట గుండె సమస్యలు ఉండవు .

ఈ మధ్య కాలం లో ఎక్కువ మందికి కీళ్ల నొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముప్పై ఐదు దాటాయంటే.. ఎక్కువగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడం కోసం ఎక్కువ మందులు వాడడం కంటే.. ఆహరం లో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవడం మంచిది. ఈ చిన్న టిప్.. కీళ్ల నొప్పులను, డయాబెటిస్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ అల్లం తురుము, ఒక స్పూన్ తేనే కలిపి తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చు.

అలాగే ఇది ఇన్ఫెక్షన్ ను, గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను కూడా అల్లం తేనే మిశ్రమం క్రమబద్ధీకరించి మలబద్ధకం బారిన పడకుండా కాపాడుతుంది.దీనిలో శక్తి వంతమైన ఔషధ గుణాలు కలిగిన జింజరోల్ అనే రసాయనం ఉంటుంది .అనేక రకాల వికారాలు ,ముఖ్యాoగా ప్రయాణాల వలన కలిగే అనారోగ్యం ,వాంతులు వచ్చినట్లు ఉండడాన్ని చికిత్స చేయగలదు . బరువు తగ్గడానికి సహాయపడవచ్చు .ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సకి సహాయ పడుతుంది. రక్తంలో చెక్కెరలను తగ్గించవచ్చు . మరియు గుండె జబ్బుల ప్రమాద కారకాలను నిరోధించడంలో శరీరాన్ని మెరుగుపరుస్తుంది . దీర్ఘకాలిక అజీర్ణం చికిత్సకు సహాయపడుతుంది .

Sahaja Aharam - Ginger/Allam

జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడంలో దోహద పడుతుంది . తేనెలో అనేక పోషకాలు ఉంటాయి . స్వచ్ఛమైన హై క్వాలిటీ ఆర్గానిక్ తేనెలో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . మధుమేహ వ్యాధిగ్రస్తులకు చెక్కెర కంటే తేనె “తక్కువ చెడ్డది “ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి . తేనె కూడా మంచి కొలస్ట్రాల్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది .తేనె ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తుంది .మరియు గాయాలను నయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది . ఇక అల్లం కి తేనె జోడించడం వల్ల రుచి బాగా చేసి ఘాటును తగ్గిస్తుంది .

Iran ranks 3rd in producing honey in world - IRNA English

తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి . కనుక ఇది అదనపు వైద్య ప్రయోజనాలు అందిస్తుంది అనేక అధ్యయనాలు తేనె యొక్క యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలను అన్వేషించాయి . మరియు ఇది అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరస్లను నిరోధించడంలో ,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది . అందుకే ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని ఒక్క స్పూన్ ఉదయాన్నే తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు .