డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఒక ఆకు గురించి తెలుసుకుందాం.డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో నార్మల్ వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటిస్ అనేది గుండె, ప్యాంక్రియాస్, కిడ్నీ మొదలైన ముఖ్యమైన అవయవాల మీద ప్రభావాన్ని చూపుతుంది.
డయాబెటిస్ నియంత్రణలో బిల్వ పత్రం అంటే మారేడు ఆకు సహాయపడుతుంది.ఆయుర్వేదంలో ఎక్కువగా మారేడు పత్రంను(బిల్వ పత్రం) ఉపయోగిస్తారు. బిల్వ ఆకుల్లో మధుమేహాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. బిల్వపత్రంలో హైపోగ్లైసీమిక్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.ఇవి డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి. ప్రధానంగా ప్యాంక్రియాస్ గ్రంధిని బలపరుస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ప్రతి రోజు ఉదయం మూడు బిల్వ పత్రాలను నమిలి మింగాలి….లేదంటే బిల్వ పత్రాల జ్యూస్ చేసుకొని తాగవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు వీలైనంత ఎక్కువగా ప్రొటీన్లు, పీచు పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు మొదలైన వాటిని ఆహారంలో తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఇంటిలో మారేడు (బిల్వ ) చెట్టును పెంచుకుంటున్నారు. కాబట్టి ఈ ఆకులను తీసుకొని డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోండి.
Swaroopa Rani
- Edit
hi good evening