మీరు ఉన్న ఫలంగా సగానికి సగం బరువు తగ్గాలంటే …

సొరకాయ జ్యూస్ రహస్యాలు :- ఈ రోజు మనం బరువు తగ్గడానికి, కాలేయం(లివర్) ఆరోగ్యకరంగా ఉండటానికి, మన గుండె ఆరోగ్యకరంగా ఉండటానికి, డైజీషన్ సరిగ్గా అవ్వడానికి, మన కిడ్నీలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వెజిటేబుల్ జ్యూస్. వెజిటేబుల్ జ్యూస్ అది ఎలా చేయాలంటే సొరకాయతో చేసుకుందాం. సొరకాయ తింటే ప్రయోజనం రాదు. సొరకాయ జ్యూస్ తాగితే ప్రయోజనం ఉంటుంది. ఈ సొరకాయ జ్యూస్ తాగడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఒక రెండు రోజులు ప్రయత్నిస్తే సులువుగా తాగొచ్చు.అయితే కొంతమందికి ఇది చేయడం రాకపోవచ్చు. ఒకవేళ చేసిన అది పచ్చిపచ్చిగా ఉండటం, రుచించక పోవడం ఈ లక్షణాల వల్ల చాలామంది ఈ సొరకాయ జ్యూస్ ని తాగరు. ఈ సొరకాయ జ్యూస్ లో మనం వివిధ పదార్థాలను వేసుకొని వాడవచ్చు.

వివిధ రుచులను తెలుసుకోవచ్చు. మీరు ఈ సొరకాయ జ్యూస్ లో మిరియాల చూర్ణం కలపడం వలన ఒక రుచి వస్తుంది. అల్లం రసం కలపడం వలన ఒక రుచి వస్తుంది.వెల్లుల్లి కలుపుకోవడం వలన ఒక రుచి వస్తుంది. కొద్దిగా ఉప్పు కలుపుకోవడం వలన ఒక రుచి వస్తుంది. ఇంకా ఇవే కాకుండా యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు. సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక సొరకాయను తీసుకొని దాని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మరిగిన నీటిలో వేసి కాసేపు దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే అవి బాగా మెత్తబడి నీటిని పీల్చుకుని ఉంటాయి. అందువల్ల ఆ సొరకాయ ముక్కల్లో ఉన్న పోషకాలు పోకుండా ఉడికినట్టు ఉండి రసం కూడా బాగా వస్తుంది.దీంట్లో కొంచెం అల్లం ముక్కను, ఏకగర్భ వెల్లుల్లి కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచాలి. అలా ఉంచడం వలన అవి మెత్తబడి ఉంటాయి. తర్వాత వడపోసుకోవాలి. నీరు మొత్తం పోయి చల్లబడే వరకు ఉంచుకోవాలి.

చల్లబడిన ఆ సొరకాయ ముక్కలను జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ లో వడపోసుకోవాలి. దీనిలోకి కొంచెం సైంధవ లవణం కలుపు కుందాం. కొంత త్రికటచూర్ణం (సొంటి, పిప్పళ్ళు ,మిరియాలు) వేసి బాగా కలపాలి. సొరకాయ జ్యూస్ చేసే విధానం అర్థమైంది కదా. సొరకాయ జ్యూస్ రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇది మీరు రోజు తాగిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజు ఉదయం పరిగడుపున తాగండి లేదా తిన్న తర్వాత రెండు గంటల తర్వాత తాగొచ్చు.ఒకటే ఏంటంటే ముందు మీ కాలేయాన్ని చాలా బాగా ఉంచుతుంది. మీ గుండె(హార్ట్)కి చాలా మంచిది. మీ లోపల కొలెస్ట్రాల్ లాంటివి పేరుకోకుండా కాపాడ గలుగుతుంది. ఇది మీ హార్ట్ హెల్త్ కు మంచిది. మీ జీర్ణ శక్తిని అభివృద్ధి చేస్తుంది. అలాగే ఈ సొరకాయ జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన మోషన్ ఫ్రీ అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్. ముఖ్యంగా మనకు కాలేయం, గుండె, జీర్ణశక్తి, కిడ్నీ, ఊపిరితిత్తులు ఈ ఐదు భాగాలు సక్రమంగా ఉంటే మనకు ఈ పొట్ట సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే అన్నిటికంటే షుగర్ కు ఒక గ్లాస్ తాగారా అంతే చాలా బాగా పనిచేస్తుంది.