శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు ఇలా చేస్తే ఎక్కువ ఫలితం దక్కుతుంది …..

శివరాత్రి అంటే ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం!శివరాత్రి అనగానే శివపార్వతుల కళ్యాణం. ఈ కల్యాణం గురించి తెలుసుకుందాం! శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజే శివరాత్రి అన్న వాదన పై రెండు కథలు ఉన్నాయి.నిజానికి శివరాత్రి శివపార్వతుల కళ్యాణం కాదు, శివుని ఆవిర్భావం, అంతే ఆ రోజు శివుని యొక్క ఆద్యంతాలు తెలుసుకోవడానికి చేయబడిన ప్రయత్నంగా చెప్పుకుంటారు. దీని గురించి ఒక పురాణగాథ ఉంది, ప్రళయకాలంలో బ్రహ్మ, విష్ణువు లిద్దరూ యుద్ధం చేయబోయారు.అంటే ప్రళయం వచ్చేసరికల్లా ఏమవుతుంది అంటే ,మొత్తం ప్రపంచం అంతా లయం అయిపోతుంది, దేవతలు కూడా అందరూ తలక్రిందులు అయిపోతారు. ఇలా మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం కలిసి పోయి మళ్లీ సృష్టి మొదలవుతుంది.

ఈ మళ్లీ మొదలయ్యే కాలానికి కొద్దిగా ముందు, అంటే ప్రళయం వచ్చినప్పుడు అందరికీ ఎంతో కొంత ద్వివేది భావాలు కలుగుతాయి, అప్పుడు బ్రహ్మ, విష్ణువు ని నేను సృష్టికర్తను నువ్వు నన్ను గౌరవించాలి అని బ్రహ్మ, నా నాభి యందు కమలం నుండి పుట్టిన వాడివి నువ్వు అని విష్ణువు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు, దీనికి బ్రహ్మ ఒప్పుకోలేదు, ఇద్దరు కలిసి ఇ యుద్ధం చేశారట. బ్రహ్మ,విష్ణు లలో ఒకరు పుట్టిస్తే, ఇంకొకరు పాలిస్తారు, అలా అలా ఇద్దరూ యుద్ధానికి సిద్ధమైన అప్పుడు, నారదుడు మరియు కొంత మంది దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి వీళ్లిద్దరు యుద్ధం చేస్తున్నారు అని చెప్పారు, సరిగ్గా ఇదే సమయంలో ఏమైందంటే, ఒకరు మహేశ్వర అస్త్రము, మరొకరు పాశుపత అస్త్రము సంధించారట, అంటే ఇద్దరూ శివుడికి సంబంధించిన అస్త్రాలే సంధించారు.

ఈ రెండు అస్త్రాలు సంధించేసరికి, ఈ రెండు తాకిడికి రాగానే అక్కడికి వచ్చినటువంటి శివుడు ఒక అగ్ని స్తంభ రూపంలో ఉద్భవించాడు అట, ఆ రెండు బాణాలు ఒకదానికొకటి తగిలాయి, అదే సమయంలో అక్కడికి ప్రత్యక్షమైన మహేశ్వరుడు అగ్ని స్తంభం లాగా అంటే ఒక నీలూతా పైకి భగభగ మండిపోతుంది అగ్ని స్తంభం లాగా, అప్పుడు వీళ్ళిద్దరూ ఉలిక్కిపడి తెలుసుకున్నారు, ఈ అగ్నిస్తంభం తాలూకు తుది, మొదలు తెలుసుకోవాలని అనుకున్నారు, ఇలా అనుకుని ఒకరూ పైకి, ఒకరు కిందికి వెళ్లారట, విష్ణువు వరాహ రూపం తో క్రిందికి వెళితే, బ్రహ్మ హంస రూపంతో పైకి వెళ్ళాడు, అయినా వాళ్ళు తెలుసుకోలేకపోయారు, మళ్ళీ వారి యధా స్థానాలకి చేరుకునేసరికి, అమ్మకి పైకి వెళుతుంటే ఒక మొగలి పువ్వు, ఒక కామధేనువు రెండు కనిపించాయట, అప్పుడు బ్రహ్మ నేను అంతం అంటే పైభాగాన్ని చూశానని నేను చెప్తాను, దానికి మీరు అవునని సాక్ష్యం చెప్పండి అని చెప్పాడు, మొగలిపువ్వు, కామదేనువు ఈ రెండు బ్రహ్మ తో సరే అన్నాయి.

విష్ణువు క్రిందికి వెళ్లి చూసాడు, ఆ మొదలు అనేది తెలుసుకోలేక పోయాడు, నేను తెలుసుకోలేకపోయాను అని విష్ణువు స్పష్టంగా చెబితే, బ్రహ్మ నేను చూశాను పైభాగం అని అబద్ధం చెప్పాడు, సాక్ష్యం అని అంటాడు, అప్పుడు మొగలిపువ్వు అవునని చెబుతుంది, కామదేనువు అవును అని తలతో చెప్పి, కాదు అని తోక తోటి నిజం చెప్పింది. అప్పుడు ఆద్యంతాలు ఇద్దరు చేసుకోలేకపోయారూ, అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వుకు వెంటనే పూజార్హత పోయిందట, అప్పుడు వెంటనే శివుడు స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడట, ప్రత్యక్షమై మొగలి పువ్వును ఇలా శపించాడట, నువ్వు అబద్దం చెప్పావు కాబట్టి నీకు పూజా అర్హత లేదు, అక్కడి నుండి కామదేనువు ముఖంతో అవును అని చెప్పి, తోకతో కాదని చెప్పింది కాబట్టి, ముఖానికి పూజా అర్హత లేదు, వెనుక భాగానికి పూజా అర్హత ఉంది అని చెప్పాడు, అందుకనే వెనుకభాగం నుండి వచ్చే పాలు కానీ పెరుగు, గోపంచకం, కూడా పూజా అర్హత అయినవిగా మనం కొలుస్తాం.