మెదడును శాశ్వతంగా దెబ్బ తీసే వ్యాధి.. ఒక్కసారి వస్తే అంతే సంగతులు!

మనిషి యవ్వనంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తట్టుకుంటారు. కానీ 60 దాటిన తర్వాత రక రకాల వ్యాధులు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. వృద్దాప్యంలో సాధారణంగా నడక మారిపోవడం.. మతిమరుపు, నిద్రలేమి, మాట గట్టిగా మాట్లాడలేకపోవడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా వృద్దాప్యంలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.. తల, చేతులు, కాళ్లు, దవడ వణికిపోతుంటాయి.. నడక నెమ్మదిగా మారిపోవడం.. కండరాల బిగువు.. మతిమరుపు, నిద్ర లేమి ఇలా రక రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి.. ఈ లక్షణాలతో వచ్చే జబ్బే పార్కిన్సన్స్.

ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి.. ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వారిపై దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే గా నిర్వహిస్తుంటారు. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ.. దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. పార్కిన్సన్స్ వ్యాధి గురించి చాలా మందికి తెలియదు.. ఈ పేరు కూడా చాలా కొత్తగా ఉంటున్నారు. కానీ ఈ వ్యాధి వృద్దాప్యంలో చాలా మందికి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి చాలా అరుదుగా సంభవిస్తుంది..

కానీ దీని ప్రభావం మెదడు కణాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా మెదడులోని కదలికను నియంత్రించే సబ్ స్టాంటియా నిగ్రాలోని నరాల కణాలు దెబ్బతిని మెదడుకి తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం… పార్కిన్సన్స్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థ ఇబ్బందిని సూచిస్తుంది. దాదాపు 60 ఏళ్లకు పైబడిన వారి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 6.2 మిలియన్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తుందని అంటున్నారు.

మెదడులోని వివిధ భాగాల్లో క్లంప్స్ ఏర్పడటం కారణంగా ఈ జబ్బు ప్రభావం చూపించడం మొదలు అవుతుంది. నెమ్మదిగా దీని లక్షణాల ప్రారంభమైన తర్వాత పరిస్థితి దారుణంగా మారుతుంది. వ్యాధి భారిన పడిన వారికి నెమ్మదిగా శరీరంలో మార్పులు సంభవిస్తుంటాయి. వణుకు, నడవడానికి ఇబ్బంది, కదలికల, సరిగా మాట్లాడటేకపోవడం, మతిమరుపు, నిద్రలేమి లాంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. కండరాల బలహీనత వల్ల కండరాల నియంత్రణ సమస్యలు కూడా వస్తాయి. మిండగానికి కూడా సమస్య ఏర్పడుతుంది..

రోజు వారీ పనులు చేయడానికి పార్కిన్సన్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులు బాధపడుతుంటారు. ఈ వ్యాధికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ఏప్రిల్ 11న జేమ్స్ పార్కిన్సన్ పుట్టిన రోజు.. మొదట ఈ వ్యాధిని గుర్తించిన వైద్యుడు. అందుకే ఆయన పేరుమీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 11న పార్కిన్సన్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ వ్యాధి భారిన పడిన వారు వైద్యుల నంబర్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. ఈ వ్యాధి లక్షణాలు వచ్చిన వారు సాధ్యమైనంత వరకు ఆర్మ్ రెస్ట్ లు, బలమైన కుర్చీలు, స్ట్రెయిల్ బ్యాక్స్ లాంటివి ఉపయోగించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.