షుగర్ రోగులకు గుడ్ న్యూస్.. కొత్త మందులొచ్చాయి!

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంపూర్ణ చికిత్స లేదని భావిస్తున్నారా? అయితే షుగర్ వ్యాధికి కొత్త మందులు వచ్చాయి. ఈ మందులు వాడితే శరీరంలోని షుగర్ బయటకు వెళ్ళిపోతుంది. చిన్న వయసులోనే చాలా మంది షుగర్ వ్యాధికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి తనం, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల షుగర్ వ్యాధి పెరుగుతుంది. షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా శరీర భాగాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కళ్ళు, మెదడు, గుండె, కాలేయం, కిడ్నీ వంటి భాగాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించకపోతే అది ముదిరిపోయి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంది. శరీరం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

అలానే కణాల శక్తి కోసం అవసరమైన గ్లూకోజ్ ను ఉపయోగించడానికి ఇది సహాయపడుతుంది. డయాబెటిస్ కారణంగా దాహం అతిగా వేస్తుంది. అతిగా మూత్ర విసర్జన చేస్తారు. అలసట అనిపించడం, బలహీనంగా ఉండడం, నీరసం, ఎంత తిన్నా తక్కువ బరువు ఉండడం, కంటి చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఏదైనా డ్రగ్ లేదా మందు తీసుకోవాల్సి వస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ కలిగించనది అయి ఉండాలి. షుగర్ లెవల్స్ ని ఎక్కువ శాతంలో మార్పులు తీసుకొచ్చేలా ఉండకూడదు. అసలు ఈ డయాబెటిస్ ను పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటి వరకూ రాలేదు. అయితే ఇప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి గ్లిప్టిన్ మందులు.

ఇవి ఎక్కువ శాతం గుండెను, మూత్రపిండాలను కాపాడుకుంటూ.. షుగర్ ని కంట్రోల్ చేస్తూ దీర్ఘకాలికంగా డయాబెటిస్ ను నియంత్రిస్తాయి. మరొక మందులు ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్స్. ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్స్ అంటే సోడియం గ్లూకోజ్ కోట్రాన్స్పోర్టర్ 2 ఇన్హిబిటర్స్. ఇది టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి షుగర్ లెవల్స్ ను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని సరైన డైట్ మెయింటెయిన్ చేస్తూ.. వ్యాయామం చేస్తూ ఈ మందుని తీసుకోవాలి. ఇది ఎఫ్డీఏ ఆమోదించిన డ్రగ్. ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మూత్రపిండాలు, మూత్రం ద్వారా చక్కెరను తొలగిస్తాయి. ఈ మందుల గురించి, షుగర్ వ్యాధికి సంబంధించిన చికిత్స గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల వివరించారు. ఈ కింది వీడియోను చూడగలరు.