ఆడవారు ఉదయం ఈ టైం దాటాక అస్సలు దీపం పెట్టకూడదు!ఇంట్లో చేసే పెద్ద తప్పు ఇదే దీని వల్లే ద రిద్రంవచ్చేది….

ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటాం ,కొంతమంది దీపారాధనను ఎలా చేయాలి? ఇటువంటి ద్రవ్యాలను ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి? ఎన్ని వత్తులు వేయాలి? అవి ఎటువైపు ఉండాలి ఎలా చేయటం వల్ల మన జీవితం ఆనందంగా ఉంటుంది. అనే విషయాలపై మనకు కొన్నిసార్లు సందేహాలు కలుగుతూ ఉంటాయి. దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాలు తెలియక కొన్నిసార్లు దీపారాధనను చేసేటప్పుడు తప్పులను చేస్తూ ఉంటాము. ఆ తప్పుల వలన మనకు దరిద్రం కలుగుతుంది పూజకు ఫలితం కలుపుతుందా లేదా, మరి దీపారాధన చేసేటప్పుడు తెలియక చేసే తప్పులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం.

దీపం జ్ఞానానికి చిహ్నం, చీకటిని పారద్రోలే దివ్య జ్యోతి, ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం వేళ సంధ్య వేళ రోజుకు రెండుసార్లు దీపారాధన చేయడం హిందువుల ఆచారం. కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది దీనిని అఖండ దీపం అని అంటారు అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సాంప్రదాయం మనకు ఉంది. దీపకాంతి చీకటిని పారద్రోలి నట్లే జ్ఞానం నిర్లక్ష్యం ధోరణిని నిర్మూలిస్తుంది అంటున్నారు పెద్దలు. అందుకే అన్ని రూపాలలోనే సంపాదన అయినటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తూ ఉంటాము. సాంప్రదాయ బద్ధంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది.

దీపపు కుందులలో పోసే నెయ్యి లేదా నూనె వత్తి మనలోనే కోరికలు అహం భావాల ధోరణలకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలో కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ అహం కాలిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. దీపారాధన వల్ల ఎంతో మేలు జరుగుతుంది, భగవంతుని ముందు దీపాలు వెలిగించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు అందరూ మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం భగవంతుని పూజించడం విధిగా జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో దేవుడి ముందు దీపారాధన తప్పక చేస్తాము. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం దేవుడు కాంతి రూపంలో ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు అందుకోసం దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దేవుని స్తుతించి చేసిన పాపాలకు క్షమాపణ కోరుతాము.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేయడం లేదా దీపాల ముఖ్యతను వివరిస్తూ ఉంటారు ఫలితంగా జీవితంలో దురదృష్టాన్ని పారద్రోలు అదృష్టాన్ని వశం చేసుకోవచ్చని నమ్ముతూ ఉంటారు, ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఆనందము శాంతి ఎల్లప్పుడు కూడా ఉంటుంది. ,”దీపం జ్యోతి పరబ్రహ్మం దీపెం సర్వే తామోపం దీపే నా హారతే పాపం దీపలక్ష్మి నమోస్తుతే”. దీపం మున్మూర్తుల కూడా పరబ్రహ్మ స్వరూపమే ,వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది, దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి అంధకారాన్ని పోగొట్టడం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులో అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతికే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిలో దీపం కూడా ఒకటి.