ఆయిల్ ఇలా తయారు చేసుకుంటే జుట్టు రాలదు , జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

జుట్టు వత్తుగా, అందముగా ఉండాలని మహిళలు కాకుండా ఈ మధ్య కాలంలో పురుషులు కూడా కోరుకుంటున్నారు. ఎవరికైనా కొంచెం వాలు జడ ఉంటె చాలు ఎం నూనె వాడవు, ఈ షాంపూ వాడవు అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. జుట్టు సమస్య అనేది 100 లో 90 శాతం మందికి ఉంటుంది. ఇపుడు పుట్టిన పిల్లలకు అసలు జుట్టే రావటం లేదు. చిన్నప్పటి నుండే జుట్టు నెరిసి పోవటం, తెల్ల వెంట్రుకలు రావటం, బట్ట తల రావటం జరుగుతుంది. జుట్టు పెరగక ఆర్టిఫిషల్ విగ్గులు, సవరలు, బోలెడు డబ్బులు పెట్టి హెయిర్ ప్లాంటేషన్ థెరపీలు చేయించుకుంటున్నారు.

మనము చిన్నగా ఉన్నపుడు జుట్టు అనేది బాగా పెరిగేది. పెద్దయ్యాక పెరగటం లేదు అంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే చిన్నపుడు మన అమ్మలు, అమ్మమ్మలు, పెద్దవారు చక్కగా తలకు నూనె పెట్టేవారు. షాంపోలతో కాకుండా శిక్షకాయ, కుంకుడు కాయలతో, గంజితో తలంటు పోసేవారు. గంజిలో విటమిన్ ఈ ఉంటుంది. జుట్టును బాగా పెంచుతుంది. అయితే జుట్టు పెరగడానికి కొన్ని మనకు ఈజీగా దొరికే ఆకులతో తాయారు చేసుకునే నూనె గురించి తెలుసుకుందాము.

గుప్పెడు మందార ఆకులూ, పువ్వులు, నానబెట్టిన ఒక స్పూన్ మెంతి గింజలు, గోరింటాకు, కలబంద ముక్కలు, ఉసిరి ముక్కలు, బృంగరాజు ఆకులూ, తులసి ఆకులూ, గుంట గలగారకు, సరస్వతి ఆకూ, హాఫ్ కే జి కొబ్బరి నూనె. వీటన్నిటిని తీసుకొని శుభ్రం చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో నురగ తగ్గేవరకూ కలుపుతూ వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద నించి దించి వడ పోసి నిలవ చేసుకోవాలి. ఈ నూనెను రోజు వాడటం వలన కేశాలకు మంచి రక్త ప్రసరణ జరిగి జుట్టు నల్లగా, పట్టులాగా, బలంగా, వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలటం, చుండ్రు, పెనుగొఱుకుడు సమస్యలు తగ్గుతాయి. సువాసన కొరకు ఈ నూనెకు మరువం లేదా దవనం వాడవచ్చు.