అక్కడ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే ఇలా చేయండి.

కాలం మారింది, మనిషి ఆలోచించే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. పూర్వం వంటింటికి మాత్రమే నియమించబడ్డ స్త్రీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన అడుగులను విస్తరిస్తుంది. ఇల్లు గడవాలంటే గడప దాటి తీరాలి అనే తన పరుగులో ఉద్యోగం కోసం ఒక చోట నుండి మరోకచోటికి ప్రయాణం చేస్తుంది. ప్రయాణo చేస్తూ ఉద్యోగం చేసేవారిలో సహజంగా నీళ్ళు తక్కువ తాగే పరిస్థితి ఏర్పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు అనుకూల పరిస్థితులు లేక, వాష్-రూం వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్ని అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని, మంచి నీళ్ళు తక్కువ తాగుతూ ఉంటారు. కొందరిలో బయట పబ్లిక్ టాయ్లెట్ వాడుకోవటం వల్ల, పబ్లిక్ టాయ్లెట్ లోని అశుభ్రత పరిస్థితులు వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటుంది. ఈ కారణం చేత యోని మార్గంలో దుర్గంధం రావడం ఇంకొన్ని ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది.

దుర్గంధం దూరం చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.!

మన శరీరానికి రోజుకు నాలుగు లీటర్ల నీళ్ళు అవసరం. మంచినీళ్ళు తక్కువ తాగేవాళ్లకి శరీరం డి-హైడ్రేట్ అవుతుంది. ఆ కారణాన యోని మార్గం గోడలు పొడిబారి అక్కడ బ్యాక్టీరియ, ఫంగస్ లాంటి సూక్ష్మ జీవుల పెరుగుదల రెట్టింపు అవుతుంది. మంచి నీళ్ళు తక్కువగా తాగడం వల్ల యూరిన్ రంగు మారి ఘాటుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని సందర్భల్లో శుభ్రపరచడానికి అవకాశాలు లేదన్నప్పుడు ఘాటైన యూరిన్ యోని భాగంలోని ఇన్ఫెక్షన్స్-ను మరింత ఎక్కువ చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయిటికి వేసే యూరిన్-లో బ్యాక్టీరియాను పెంచే లక్షణాలు ఉంటాయి. యోని మార్గంలో తడిగా ఉండిపోవడం కూడా దుర్గంధానికి కారణం అవుతుంది. యోని మార్గంలో క్రిములు పెరగకుండా కొన్ని ఆసిడిక్ వాతావరణం ఉంటుంది.ఈ తడి వల్ల ఆసిడిక్ నేచర్ తగ్గిపోయి, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

సమస్యకు పరిహార మార్గం.!

5ml కొబ్బరి నూనెలో 2ml ల్యావెండర్ ఆయిల్ కలిపి యోని భాగంలో రాసుకోవాలి.

-ఆర్గానిక్ తేనెను రాసుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.

-వీలైనంత వరకు కాటన్ ఇన్నర్ వేర్ వాడటం మంచిది. అలానే వాటిని శుభ్రంగా ఉతికి, ఎండలో బాగా ఆరిన తర్వాత ఉపయోగించటం ఇంకా మేలు కలిగిస్తుంది.

– పబ్లిక్ టాయ్లెట్ వాడుకోవాల్సినప్పుడు వెట్ టిష్యూ పేపర్స్ తప్పకవాడాలి.

-ముఖ్యంగా రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగండి. ఎప్పటికప్పుడు యూరిన్ క్లియర్ చేసుకోండి. -కారం, మసాలా పదార్థాలు, వెల్లుల్లి లాంటి ఘాటు పదార్థాలను వంటలో తక్కువగా వాడుకోండి.