ఇది బుగ్గన ఉంచుకుంటే షుగర్ ఎందుకు తగ్గుతుంది …..

మనం తిన్న ఆహారంలో ముఖ్యంగా పిండి పదార్థాలు జీర్ణమైన తర్వాత చక్కెరగా మారుతాయి, ఆ చక్కెర రక్తం లోపలికి చేరిన తర్వాత అక్కడి నుండి కణం లోపలికి వెళితే తప్ప మనకు శక్తి రాదు.రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్లాలంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ కావాలి. తిన్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర వచ్చినది వచ్చినట్టు తగు మోతాదులో కణం లోపలికి వెళ్ళిపోతుంటే మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది.ఇన్సులిన్ అనేది కణం యొక్క తలుపులు తెరిచి రక్తం లోపలికి చక్కెర వెళ్ళేటట్లు చేస్తుంది, ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే గ్రంధి నీ ఫ్యాన్ క్రాస్ అంటారు, ఈ గ్రంథి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

ఈ ఫ్యాన్ క్రాస్ గ్రంధి లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు అంటారు, ఈ బీటా కణాలనీ బాగా యాక్టివేట్ చేయగలిగితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది, ఈమధ్య ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంత మందికి వయస్సు పెరిగే కొద్దీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఇన్సులిన్ కూడా ఎక్కువ మోతాదులో విడుదలైన తక్కువ పనిచేస్తుంది. ఇన్సులిన్ క్వాలిటీ తగ్గిపోతుంది, అందుకనే రక్తంలో చక్కెరను నియంత్రించే కెపాసిటీ కూడా తగ్గిపోయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగీ షుగర్ పెరుగుతుంది, మరి రక్తంలో షుగర్ స్థాయి నియంత్రించడానికి ఇన్సులిన్ బాగా పని చేయడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది, దాల్చిన చెక్కలో ఉండే కెమికల్ కాంపౌండ్ బీటా సెల్స్ ని బాగా ఆక్టివేట్ చేసి ఇన్సులిన్ బాగా పనిచేసేటట్లు చేస్తుంది, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే తక్కువ ఇన్సులిన్ ని ఎక్కువ సేపు చక్కెరని గ్లూకోజ్నీ కణం లోపలికి వెళ్ళేటట్లు చేస్తుందట.

అందుకనే ఇంత బాగా ఇన్సులిన్ పని చేయడానికి పనికొస్తుందని ప్రయోగం చేసిన వారు 2010 వ సంవత్సరంలో అమెరికా వారు ఈ పరిశోధన దాల్చిన చెక్క మీద చేసి గెలిచారు, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు కూడా తగు మోతాదులో అంటే ఫాస్టింగ్ టెస్ట్ చేస్తే 110 అంతకంటే తక్కువ, పోస్ట్ లంచ్ లో పరీక్ష చేస్తే 170 గా ఉంటుంది, దాల్చిన చెక్క అనేది చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి తక్కువ మోతాదులో వాడినా కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది, అంటే మనం వంటల్లో విందు భోజనాల్లో, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసినప్పుడు రైస్ఐటమ్స్ ఎక్కువ తినేస్తారు, అప్పుడు చక్కెర స్థాయిలు రక్తంలో పెరుగుతాయి, ఇలా పెరగకుండా అందులో వేసిన దాల్చినచెక్క సహాయపడుతుంది, దాల్చిన చెక్కల పొడిని కూడా కేరళ వంటి ప్రాంతంలో కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటారు, కాబట్టి ఇలాంటివి మన ఋషులు చెప్పిన విజ్ఞానాన్ని సైంటిఫిక్ గా ఉంది కాబట్టి మనం నమ్మి వాడుకుంటే ఫలితాలను పొందగలుగుతాం.