తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే మీకు జరగబోయేది ఇదే ….

తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా? ఒకవేళ అలా పెట్టుకుంటే ఇంట్లో ఏ మూల పెట్టుకోవాలి? ఏ రోజున తెచ్చి పెట్టుకోవాలి, అలాగే తాబేలు ఉంగరాలు ఏ వేలుకు ఇస్తే మనకు ఏం మంచి జరుగుతుంది? ఎలాంటి తాబేలు బొమ్మను పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం!ఇంట్లో ఎలాంటి తాబేలు బొమ్మ ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి, అదృష్టం, ఐశ్వర్యం కలిసివస్తాయి కలిసి వస్తాయి అనే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం!ప్రస్తుత ప్రపంచంలో చాలామంది ఇళ్లల్లో హడావిడి లైఫ్ ,బిజీ లైఫ్లో కూడా తాబేలు బొమ్మను అయితే ఇంట్లో ఉంచుకుంటున్నారు, వాటి ప్రయోజనాలు తెలిసినా తెలియకపోయినా కొంతమంది ఫ్యాషన్గా పెట్టుకుంటే మరికొంతమంది దాని ప్రయోజనాలు తెలిసి, ఆ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటున్నారు.

ఇదే అసలు తాబేలు బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, కొంతమంది తాబేలు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం, మనం తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకునే టప్పుడు ఒక్కొక్క రకం తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచడం ద్వారా, ఒక్కొక్క రకం ప్రయోజనం మనకు చేకూరుతుంది, అలాగే తాబేలు ఉంగరం చేయించుకుంటే చాలా చాలా మంచిది, చాలామంది తాబేలు ఉంగరాలు పెట్టుకుంటున్నారు, అయితే తే.గీ ఈ తాబేలు ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకోవాలో ఆ వేలు కు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది, చాలా చాలా కష్టపడుతున్నారు కానీ దానికి తగిన ఫలితం ఏమీ కనబడట్లేదు అనుకునేవారు, తాబేలు ఉంగరాన్ని మధ్యవేలికి ధరించాలి, ఆడవారికైనా, మగవారికైనా సరే మధ్యవేలికి ధరించాలి అలాగే తాబేలు ముఖం అనేది మన వైపు కాకుండా,బయటకి చూస్తూ ఉండాలి ఇలా ధరించాలి.

మనం చేస్తున్న వృత్తిలో మంచి ఎదుగుదల కావాలి, మంచి ప్రమోషన్స్ కావాలి అనుకునే వారు, లైఫ్ లో బాగా సెట్ అవ్వాలి అనుకునేవారు, తాబేలు ఉంగరాన్ని ఉంగరం వేలికి పెట్టుకోవాలి, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు అనేవారు మధ్యవేలుకి పెట్టుకోవాలి, తొందరగా ప్రమోషన్స్ వచ్చి మంచి అధికార పదవులను కావాలి అనుకున్న వారు ఉంగరంవేలికి పెట్టుకోవాలి. ఇంట్లో వాస్తు దోషాలు ఉండకూడదు, ఈ వాస్తు దోషాలు ఉన్నా మా ఇంట్లో నుండి పోవాలి అనుకునేవారు, నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అనుకునేవారు, తాబేలు బొమ్మను ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలి అంటే ఒక గాజు బౌలి ఉంచి అందులో నీళ్లు పోసి ఉత్తర దిక్కున తాబేలు బొమ్మను పెట్టుకోవాలి, అప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు, పిల్లల చదువు ఎక్కడికక్కడ ఆగిపోతుంది అలాంటప్పుడు వారు చదువుకునే అటువంటి రూమ్లో బెడ్ రూమ్ లో గాని ఇత్తడిబొమ్మ ఉంచాలి, అప్పుడు వాళ్లు బాగా చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా కూడా మంచి సక్సెస్ అనేది పొందుతారు, భార్య భర్తల మధ్య ఇప్పుడు గొడవలు, తగాదాలు, చికాకులు ఉన్నాయనుకోండి అప్పుడు 2 చిన్న తాబేలు బొమ్మలను బెడ్ రూమ్ లో ఉంచుకోవాలి, అప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు అన్ని తొలగిపోతాయి, కొంతమంది ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటి వారికి మట్టితో తయారు చేసిన తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవాలి, ఏ తాబేలు బొమ్మ నైనా ఇంట్లో ఉత్తర దిక్కున పెడితే మంచిది, ఎవరైనా బిజినెస్ ని కొత్తగా స్టార్ట్ చేశారూ అనుకోండి, విపరీతంగా నరదిష్టి తగిలి బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకునేవారు, వెండితో తయారుచేసిన తాబేలు బొమ్మను మీ బిజినెస్ స్పాట్ లో ఉత్తర దిక్కున పెట్టండి, కచ్చితంగా దిష్టి పోతుంది అదేవిధంగా వ్యాపారంలో డబుల్ బెనిఫిట్స్ కావాలి, మేము చేసేటటువంటి వ్యాపారoలోఎంత అయితే అంచనా వేస్తామో అంత కంటే రెట్టింపు లాభాలు కావాలి, వ్యాపారంలో విపరీతమైన లాభాలు కావాలి అనుకునేవాడు క్రిస్టల్ తాబేలు బొమ్మను కచ్చితంగా వ్యాపార ప్రదేశంలో పెట్టుకోవాలి, అసలు ఎటువంటి తాబేలు బొమ్మ నైనా సరే ఇంట్లో గాని వ్యాపారంలో గాని ఉంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది.