ఇలా చేస్తే కరెంట్ బిల్ 100 కూడా రాదు.. వస్తే మేమే కడతాము.. Tips for Reduce & Saving Power in Home

కాలం మారుతుంది టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది, అయితే ఏ టెక్నాలజీ పెరిగిన సరే కరెంటు మాత్రం తప్పనిసరిగా కావాల్సిందే, కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతున్నాయి ఇక ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ కామన్ అయిపోయింది, వాటికి తోడు వైఫై , కనెక్టింగ్ రూటర్ లు, టీవీలు, ట్యాబ్‌లు ఇలా ఎటు చూసినా ఎలక్ట్రిక్ వస్తువులే కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో system ఉంటే సౌండ్ సిస్టం కంపల్సరీ, వాషింగ్ మిషన్, ఫ్యాన్, ఏసీ, వాక్యూమ్ క్లీనర్ ఇలా లెక్క చదువుకుంటూ వెళ్తే శాంతాడు అంతా అవుతుంది.

కానీ పవర్ను తెలివిగా వాడితే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు, వేల నుండి 100 లోకి రావచ్చు, ఒకవేళ వందల్లో ఉంటే 100 రూపాయలతో సరిపెట్టుకోవచ్చు, ఈరోజుల్లో కామన్గా కరెంట్ బిల్లు 600 నుండి వెయ్యి రూపాయల వరకు వస్తుంది, ఇక మధ్యతరగతి వాళ్లకు ఏసీ లాంటివి ఉంటే, ఎండాకాలం వచ్చిందంటే ఆ బిల్లు మూడు నుండి నాలుగు వేలతో పెరిగిపోతుంది.అయితే వీటిని తగ్గించుకోవడం చాలా చాలా సులువు, మొదట్లో మూడు నాలుగు వందలు తగ్గిన చాలు, ఏడాదికి 3600 అవుతుంది, రెండు వందలు మిగిలిన కూడా ఏ పేపర్ బిల్లుకో, కేబుల్ బిల్లు కో పనికొస్తుంది కదా , తక్కువ పోదుపే రేపు మరింత ఆదాయాన్ని తెలుస్తుంది, దానికి మనం ఏం చేయాలి, ఇంట్లో రీఛార్జ్ కి ఒక చార్జర్ వాడడం మంచిది, ఒకరి తర్వాత ఒకరు ఛార్జ్ చేసుకోవడం వల్ల కరెంట్ చాలా అలా ఆదా అవుతుంది.

ఎందుకంటే చార్జర్లు ఉన్నవి కదా అని రూమ్ కి 1 పెట్టడం వల్ల మనం వాడకపోయినా కూడా ఏడాదికి పది శాతం వీటి వల్లే అదనపు విద్యుత్ బిల్లు వస్తుంది, మనం వాడడం లేదు కదా అని ప్లగ్ ఉంచి స్విచ్ ఆఫ్ చేస్తామేమో అది కూడా తప్పే, అవసరం లేకుంటే వెంటనే ప్లగ్ నుండి కూడా తీసివేయాలి, ఇక చదువుకునే వారు రోజంతా పెద్ద లైట్ వేసి చదువుకోకుండా టార్చ్ లైట్ వాడితే మంచిది, వెలుతురు ఎక్కువ ఉంటుంది కరెంట్ కూడా చాలా సేవ్ అవుతుంది, ఇక సి ఎఫ్ బల్బులు బాగా వెలుగుతున్నాయి కదా అని వాడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది, ఎందుకంటే కొత్త బల్బు కొనడానికి ఇబ్బంది పడతారు కానీ వీటివల్ల 90 శాతం అదనపు కరెంట్ బిల్లు వస్తుంది, కాబట్టి వీటిని తీసి ఎల్ ఈ డి బల్బులను అమర్చడం ఉత్తమం.

ఇక ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ రావడానికి కారణం డెస్క్ టాప్, లాప్ టాప్ వీటిని అవసరం ఉంటేనే వాడండి లేదంటే షట్ డౌన్ చేయండి, ఐదు పది నిమిషాలు అయితే ఓకే కానీ అంతకుమించి అయితే ఖచ్చితంగా షట్ డౌన్ చేసి స్విచాఫ్ చేసి వెళ్ళాలి, లేదంటే ఈ నిమిషాలే కౌంటు అయ్యి నెలకు150 నిమిషాలు అంతకంటే ఎక్కువ చొప్పున ఐదు యూనిట్లకు ఎక్కువగా వస్తుంది, ఇలా అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా వాడితే చాలు, నెలకు కనీసం రెండు వందల పైన అదనపు బిల్లు కట్టాల్సి వస్తుంది, ఇంకా వెంటిలేషన్ వాడుకోవడం అనేది ఇది చాలా చాలా అవసరం, నేచురల్ లైట్ ఇంట్లోకి వస్తే ఇంట్లో ఆహ్లాదకరంగా ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది, ఇక ఉదయం ఆఫీస్ కి వెళ్లేవారు వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు, సందర్భాన్ని బట్టి చన్నీటి స్నానం చేయండి.

ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, అలాగే గీజర్, హీటర్ అలాంటివి పెట్టి వదిలేయకుండా టైం లిమిట్ చూసుకోండి, ఆ టైం కి మించి ఒక్క నిమిషం కూడా ఎక్కువ పెట్టకండి , వీలుంటే తగ్గించుకునే మార్గమే ఆలోచించండి, ఇంకా ఇక ఇంట్లో ఐరన్ చేసుకుంటే ఒకేసారి ఎక్కువ బట్టల్ని చేసుకోవడం వల్ల కూడా అ పవర్ సేవ్ అవుతుంది.ఇక నెలకు ఒక వారం వాషింగ్ మిషన్ లోడ్ ని తక్కువ చేసుకోవడం ఉత్తమం, చల్లని నీటితో బతకడం కూడా అవసరం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చాలావరకు డబ్బులను ఆదా చేస్తాయి, మన జేబులో డబ్బును ఖర్చు పెట్టకుండా కాపాడతాయి, విడిగా చూస్తే ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాఏమో, కానీ ఈ రోజు మిగిలిన పది రూపాయలు నెల అయ్యే వరకు 500 నుండి 1000 రూపాయల వరకు కూడా సేవ్ అవుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇది మనం ఖర్చు చేసేది కాదు అదనంగా సంపాదించింది అనే లాజిక్ ని అస్సలు మర్చిపోకండి.