ఈఒక్క పధకంతో మీజీవితమే మారిపోద్ది కేవలం 1500/- కడితే చాలు…

ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ లేకుంటే జనజీవనం స్తంభించేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పోస్ట్ ఆఫీస్ సేవలకు కొన్ని ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చారు.కానీ ఎన్ని వచ్చినా ప్రజాజీవనంలో పొదుపు అనే మంత్రాన్ని చాటి చెప్పింది మాత్రం పోస్ట్ ఆఫీసే. మల్టీ నేషనల్ బ్యాంకుల హవా నడుస్తున్న ఈ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు.అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా తీసుకుని తపాలా శాఖ లోను డిపాజిట్లు ,చెక్ సదుపాయం, ఏటీఎంలు , ఆన్లైన్ ట్రాన్స్ఫర్, వంటి సౌకర్యాలు కూడా వేగవంతం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ నిర్వహించే ముఖ్యమైన పొదుపు పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిపై ఖచ్చితమైన రాబడి సురక్షితమైన పెట్టుబడి మార్గం తో నెల నెల ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమైంది. విశ్రాంత ఉద్యోగులకు అంటే రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్స్ కి సరిపోయే పథకం ఇది, ఈ పథకం లో కనీసం పదిహేను వందల పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు.

సింగిల్ ఎకౌంట్ అంటే ఏక వ్యక్తి ఖాతా అయితే గరిష్టంగా 4.5 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ అయితే కనిష్టంగా తొమ్మిది లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు.ప్రస్తుతం దీనికి గాను రాబడి 7.6 శాతం వార్షిక వడ్డీ వర్తింపు తో నెలనెలా ఖాతాలో జమ చేస్తారు, నెలవారి ఆదాయం కాలపరిమితి ఐదేళ్లు, మీరు ఖాతా ప్రారంభ సమయంలో లేదా ఏప్పుడైనా నామిని నీ ప్రతిపాదించవచ్చు, నామిని గా ఎవరైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది, ఖాతా ప్రారంభించే సమయంలో ఈ పద్ధతిని కచ్చితంగా పాటించాలి, పూర్తి వివరాలతో నింపిన ఎం ఐ ఎస్ ఫారం తో పాటు సంబంధిత చిరునామా, గుర్తింపు పత్రాలు, రెండు ఫోటోలు ఏవైనా పోస్ట్ ఆఫీస్ లో సమర్పించాలి, ఖాతాలో నగదు లేదా చెక్కు ద్వారా చెల్లించి ప్రారంభించవచ్చు.

ఈ పద్ధతిలో ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయసంతకం అవసరం ఉంటుంది, ఒక ఖాతాదారుడు ఎన్ని MIS ఖాతా లైన తెరిచే అవకాశం ఉంటుంది, అయితే అన్ని ఖాతాల మొత్తం 4.5 లక్షల రూపాయలు మించరాదు, అంతేకాదు నెలవారి ఆదాయ పథకం ఖాతా కు పాస్బుక్ కూడా అందజేస్తారు, ఒకవేళ మీరు మీ అకౌంట్ వేరే చోటికి లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే, ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ ఆఫీస్ కి ఖాతాను బదిలీ చేయించుకోవచ్చు, డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు, ఏడాది తర్వాత మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలి అనుకుంటే డిపాజిట్ మొత్తం సొమ్ము నుండి రెండు శాతం కోత విధిస్తారు, మూడేళ్ల నుండి ఐదు ఏళ్ళు పూర్తి కాకపోతే డిపాజిట్ ఒక శాతం కోత విధిస్తారు. పెట్టుబడి పెట్టిన రోజు నుండి ఖాతాదారులకు నెల నెలా వడ్డీ వస్తుంది, ఈ వడ్డీ పోస్ట్ ఆఫీస్ నుండి నేరుగా తీసుకోవచ్చు, లేదా మనం పొదుపు చేసిన అకౌంట్ లో లేదా బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు, వడ్డీ సొమ్ము విత్ డ్రాచేసుకోకపోతే దానిపై అదనంగా వడ్డీ జమ అవ్వదు, ఈ ఖాతా మెచ్యూరిటీ తేదీన అంతే ఐదేళ్ళ కాలపరిమితి ముగిశాక ఖాతాదారులకు మొత్తం సొమ్మును చెల్లిస్తారు.