ఈ ఆకు ఓ అమృతం ఒంట్లో సమస్యలకి సమాధి…..

ఇప్పుడున్న వాతావరణం లో మనం తీసుకునే ఎటువంటి ఫుడ్ వల్ల కంటి సమస్యలు అనేవి వస్తున్నాయి. ఈ కంటి సమస్యలకు ఒక చక్కని వైద్యం మన ప్రకృతిలో దొరికే అటువంటి మూలికల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం! వీటిని అందరూ ఉపయోగించుకొని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుని కంటి సమస్యలు లేకుండా సులభంగా బయటపడవచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించిన మూలికల గురించి తెలుసుకుందాం! మొదటి మూలిక తెల్ల గలిజేరు మొక్క, దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి, కంటి చూపు మెరుగు పడుతుంది, లివర్ ఫంక్షన్ కి ఉపయోగ పడుతుంది, కిడ్నీ సంబంధమైన వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది, మూత్రంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిస్తుంది, అంటే దాదాపు ఇది అన్ని రోగాలకు పనిచేస్తుంది.

ఇది మన చుట్టూ ఉండే పరిసరాలలో ఖాళీ ప్రదేశాలలో, తేమ ఎక్కువగా ఉండే చోట దొరుకుతుంది, దీన్ని మనం పరిశుభ్రమైన ప్రదేశంలో ఉండే మొక్కలు మాత్రమే తీసుకోవాలి. ఈ ఆకులను తెచ్చుకొని శుభ్రంగా నీటిలో కడిగి ఉపయోగించుకోవచ్చు. పసిరికలు ఉన్నవారు గలిజేరు మొక్క వేరు తీసుకుని దానిని ఒక రాయి మీదా రుద్దినప్పుడు గంధం వస్తుంది దీనిని ఎవరైతే పసిరికలతో బాధపడుతున్నారో వారి కంటి రెప్పల పై పెట్టుకుంటే కంట్లో ఉన్న మలినాలు అన్నీ బయటికి వచ్చేస్తాయి. అదేవిధంగా కంటిలోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కంటికి బలం లేకపోయినా తెల్ల గలిజేరు మొక్క వేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

అదేవిధంగా మునగాకు యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం, ఈ మునగాకును మనం వంటల్లో వాడుకుంటాం, ఇది కడుపులో ఉన్న నుసి పురుగులకు బాగా పనిచేస్తుంది, దీంట్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషులలో శుక్రకణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్ ఇతర వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు యొక్క పూలు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మునగాకు చెట్టు యొక్క ప్రతి భాగం కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి ఈ మొక్క అందుబాటులో ఉన్నవారు తప్పకుండా ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుని వాటిని పాటించండి. మునగాకు తో అందరు సాంబార్ అనేది సామాన్యంగా చేసుకుంటూ ఉంటారు, మునగాకు కూర, పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు. ఎముకలు గట్టిగా ఉండటానికి మునగాకు పనిచేస్తుంది, ముఖ్యంగా కంటి చూపు మెరుగు పడడానికి కావలసిన పోషకాలు, బలం మునగాకులో ఉంటుంది.

ఇప్పుడు ఈ రెండిటిని ఉపయోగించి మనం ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకుందాం! మొదటగా తెల్ల గలిజేరు మొక్క యొక్క లేత ఆకులను, లేత కాడలను తీసుకోవాలి, అదేవిధంగా మునగ ఆకులను రెండు కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనం కూర లాగా తయారు చేసుకోవచ్చు. లేదా ఈ ఆకులను సమానంగా తీసుకొని మనం నీడలో ఆరబెట్టి కొని, ఈ రెండింటినీ ఒక చూర్ణంలా చేసుకోవాలి, దీనిని రోజు ఒక స్పూను తేనెలో కలిపి తీసుకోవాలి. లేదా ఒక పాత్ర తీసుకుని దానిలో రెండు రకాల పొడులను తీసుకుని కొద్దిగా తేనె కలిపి బాగా కలిపితే ఒక ముద్ద లా తయారవుతుంది, దానిని రోజు తీసుకోవాలి, ఈ రెండు మూలికలను ఉపయోగించుకొని ఎవరైతే కంటి సమస్యల తో రేచీకటి తో, కంటి పొర తో, కంటిలో మంటలు ఉన్న, కంటి చూపు మందగించిన వారు అందరికీ ఈ మూలికలు చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రకృతిలో దొరికేటటువంటి ఈ మూలికలను ఉపయోగించి వ్యాధులను నయం చేసుకోవచ్చు…