శత్రువులు నిన్ను అతిగా బాధపెడితే మనసులో ఇలా అనుకో నీ ఉసురు వాళ్ళకి కచ్చితంగా తగులుద్ది….

రామా నువ్వు ధర్మాత్ముడవు నీకు రాజ్యం ఇవ్వను అని చెప్పే అధికారం నాకు లేదు. అలా అని కైకమ్మకు ఇచ్చిన మాట తప్ప లేను, నేను కైకమ్మ కు ఇచ్చిన మాట ప్రకారం కైకమ్మకు రాజ్యం ఇచ్చేశాను, భరతునికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు క్షత్ర ధర్మ ప్రకటన చేయి, నేను వృద్ధుడిని అయిపోయాను యుద్ధం చేయలేను. నువ్వు కొడుకువి యవ్వనంలో ఉన్నావు, మంచి శక్తితో ఉన్నావు, నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను బంధించి కారాగారంలో పడేయి, నేను కటకటాల లో ఉండి నువ్వు అక్కడ ఉండి నడుస్తుంటే చూస్తాను ఒకసారి, అలా చూసి బతికేస్తాను రాజ్యం నువ్వు తీసుకో, నా చేతిలో ఉందా నేను ఇచ్చా కానీ రాముడు యుద్ధం చేసి రాజ్యం తీసుకున్నాడు. కాబట్టి నీ ధర్మానికి నీకు రాజ్యం దక్కుతుంది, నా ధర్మానికి వరం దక్కుతుంది, కైక కి ఏమీ దొరకదు కానీ నేను బ్రతికే ఉంటాను. రామా నువ్వు వెళ్లి పోతే నేను ఉండలేను చచ్చిపోతాను, అందుకని నన్ను నిగ్రహించి రాజ్యం తీసుకో అన్నాడు.

https://youtu.be/mUeGwr_WEmU

అప్పుడు రాముడు తండ్రి కాళ్ళమీద పడి నాన్నగారు మీరు ఇలా అనవచ్చా, తండ్రిని గ్రహించి రాజ్యం ఏలుకోవాలా, 14 ఏళ్లు ఎంతలో గడుస్తాయి. తండ్రి ఇచ్చిన మాట సత్యం అయ్యేటట్లు ప్రవర్తించేవాడు కొడుకు అంతేగానీ మిమ్మల్ని గ్రహించి రాజ్యం పొందడం ఏమిటండి, పద్నాలుగేళ్ళు త్వరలో తిరిగిపోతాయి ఆపై వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు తప్ప, మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయనను కారాగారంలో పెట్టానని అలా చేయడం కూడా పిత్రువాక్య పరిపాలనే అవుతుంది.కానీ రాముడికి ధర్మం , శాస్త్రం కావాలి అందుకే ఆ తర్వాత అయోధ్య కాండ చిట్టచివరి లోకి వెళుతుండగా ఒక మాట అంటాడు లక్ష్మణ !భరతుడు వస్తున్నాడు భరతుడిని చంపేద్దాం అంటున్నావ్, నాకు తమ్ముళ్లను చంపినటువంటి అధర్మంతో కూడిన రాజ్యం అక్కర్లేదు. నాకంటూ రాజ్యం కలిగితే ధర్మం వల్ల మాత్రమే కలగాలి అంటాడు రాముడు. అసలు పతాకస్థాయి రాముడు జీవితంలో ఎక్కడో తెలుసా అంటే, విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలుచున్నాడు శరణాగతి చేసి రాముని ఆశ్రయం ఇవ్వమన్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళని అడిగాడు ఇవ్వమంటారా అని, రాక్షసుని తమ్ముడు మన దగ్గర ఆశ్రయం పొంది రహస్యాలను చెబుతాడు లేదా చంపేస్తాడు ఇవ్వవద్దు అన్నారు.

ఒక్క హనుమ మాత్రమే ధర్మం చెప్పాడు, రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను మీతో మనవి చేశాను కదూ రాముడు ఎప్పుడు మాట్లాడిన అది శాస్త్రం, పెద్దల వాక్కు అంటారు. ఆయన అన్నాడు నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను, నాకు ఒక ధర్మం ఉంది ,ఏమిటి ఆ ధర్మం అంటే వెనకటికి ఒక బోయవాడు అరణ్యంలో బయలుదేరాడు, పక్షులను వేటాడుతాడు కానీ ఆ రోజు అతనికి ఏమీ దొరకలేదు, అతను మంచి ఆకలితో ఉన్నాడు, సాయంకాలం అయిపోయింది ఒక చెట్టు మీద ఆడపక్షి, మగపక్షి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి,వెనకాల పిల్లలు ఉన్నాయి. బోయవాడు గురి చూసి ఇ బాణం సంధించి ఆడ పక్షి గుండెల్లో తగిలేటట్లు కొట్టాడు, ఆడ పక్షి కి బాణం తగిలి విలవిల అరుస్తూ కింద పడిపోయింది, మగ పక్షి పైన ఏడుస్తూ తిరుగుతూ ఉండగా బాణం లాగేసి, దాని ఈకలు అన్నీ పీకేసి, రెక్కలు నలిపి, బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి తినేసాడు,మగ పక్షి ఏడుస్తూ ఉండిపోయింది.

కొంతకాలం తర్వాత అదే బోయవాడు మళ్లీ అడవిలోకి వచ్చాడు మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది, చీకటి పడిపోయింది, దారి తప్పి పోయాడు, చలి, ఎటూ వెళ్లలేక ఇంతకు పూర్వం ఏ ఆడ పక్షిని తాను చంపాడో ఆ చెట్టు కిందకి వచ్చి పడిపోయాడు, పైనుండి మగపక్షి చూసింది, నా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు కాబట్టి ఇప్పుడు నాకు అతను అతిథి, ఇతన్ని కాపాడాలి అని ఎక్కడికో వెళ్లి 4 ఎండు చితుకులు తెచ్చి అక్కడ పడేసి తెచ్చి నిప్పు కణిక తెచ్చి మంట వేసింది. ఆ వేడికి బోయవాడు ఒళ్ళు కాచుకుని బతికాడు, కానీ ఆకలి వేస్తుంది. అతనికి తగిన ఆహారం తేలేని పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయి స్వయంగా ఆహారం అయింది. ఒక పక్షి తన ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది, నేను క్షత్రియుడు నై రాజ్యం పరిపాలకుడు కావాల్సిన నేను ఒక రాక్షసుడు వచ్చి శరణాగతి చేస్తే శత్రువు తమ్ముడు కదా అని నేనుశరణు ఇవ్వకపోతే నా ధర్మం తప్పిపోయినట్లే కదా! విభీషణుడే కాదు రావణాసుడు వచ్చే అడిగినా శరణు ఇస్తాను. ఈ లోకంలో ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి నా మూలకు వచ్చి పడిపోయి రామ నేను నీ వాడిని అని ఒక్క మాట అంటే చాలు వాళ్ళ చెయ్యి పట్టుకుని ఉద్ధరించడం నా కర్తవ్యం కాబట్టి నేను రక్షిస్తాను.