ఈ బెల్లం తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!!

బెల్లం, దీని గురించి మనం పెద్దగా చెప్పు కొనక్కర్లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం తింటూనే ఉన్నాం, పూజకి ఉపయోగిస్తాం, పాయసం లాంటివి చేసుకుంటాం, రకరకాల వంటలు చేసుకోవడానికి కూడా బెల్లం ఉపయోగిస్తాం, అయితే ఈ బెల్లం గురించి అత్యవసరంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది, మనం ఏ బెల్లం తింటున్నామో ఆ బెల్లమే ఆరోగ్యానికి హానికరం, అది మోతాదుకు మించి తింటే కనుక ప్రాణాలపైకి వస్తుందంటున్నారు.ఇప్పటివరకు మనం ఉపయోగిస్తున్న బెల్లం ఏమిటి, ఇప్పుడు ఆర్గానిక్ గా వస్తున్న బెల్లం ఏమిటి రెండిటికీ తేడా ఏమిటి? ఎందుకు ఇది ఇది హానికరం గా మారుతుంది అనే విషయాలను తెలుసుకుందాం!శుద్ధమైన బెల్లం తయారు చేయడం అనేది ఈ రోజుల్లో ఎక్కడా జరగడం లేదు, అప్పట్లో రైతులు శుభ్రమైన బెల్లాన్ని తయారు చేసేవారు, ఓన్లీ షుగర్ జ్యూస్ ని దాన్ని శుభ్రపరిచి, దీనికి తడి సున్నం మాత్రమే యాడ్ చేసి బెల్లం తయారు చేసేవారు.

అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది, ఇప్పుడైతే చెరుకులో రకరకాల వంగడాలు మారడం, రైతులు కూడా వారి అవసరాల కోసం చెరుకు పక్వానికి రాకముందు ఏ వాటిని కొట్టేసి, దానిలోని జ్యూస్ ని ప్యూరిటీ రాకముందు కి బెల్లం తయారీకి తీసుకు వెళ్లడం వలన, సరైన బెల్లం రావడంలేదని, దానిలో చక్కెర, కొన్ని రకాల కెమికల్స్ ను కూడా యాడ్ చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి.ముఖ్యంగా ఏమిటంటే ఈ బెల్లం తయారు లో కలిపి చక్కెర లో ,చక్కెర ప్యూరిఫై చేయడానికి మామూలుగా 23 రకాల కెమికల్స్ చక్కెరలో ప్యూరిఫై చేయడానికి యాడ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని రకాల కెమికల్స్ చక్కెరలో ఉండాలి, ఆ చక్కెరను తీసుకువచ్చి, మళ్లీ అదికూడా చాలక హైడ్రో సల్ఫేట్, అమ్మోనియం సల్ఫేట్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడడం వలన ఇది చక్కెర కన్నా చాలా ప్రమాదకరమైంది గా తయారయింది.

బెల్లం కొన్ని శాంపిల్స్ చూసినట్లయితే, మామూలు బెల్లానికి, ఆర్గానిక్ బెల్లానికి మధ్య తేడా ఏమిటో చూద్దాం!

మనకు మార్కెట్లో కలర్ ఫుల్ గా లభించే బెల్లం, ఇది మెచ్యూర్ కానీ చెరకు నుండి తీసిన చక్కెర , పాడైపోయిన బెల్లాన్ని రెండిటిని మిక్స్ చేస్తారు, ఇది ది కెమికల్ కలిపిన బెల్లం, ఇంకొకటి శుద్ధమైన బెల్లం ఇది ఇది అంతా కలర్ఫుల్ గా ఉండకుండా మామూలుగా కొద్దిగా నలుపు రంగులో ఉంటుంది.ఇది పూర్తిగా మెచ్యూర్ అయినా చెరకు నుండి తీసిన ఆర్గానిక్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం తయారు చేయడం అనేది మన ప్రాంతంలో సాధ్యం కాదు ఎందుకంటే , ఆర్గానిక్ ది చేయాలి అంటే,ఆ పంట లో పూర్తిగా మార్పులను తీసుకు రావాలి కనీసం ఆరేడు సంవత్సరాల నుండి ఆ భూమిని ఖాళీగా ఉంచి ,అందులో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా, ఎటువంటి శాంపిల్స్ రాకుండా తయారు చేసేది ఆర్గానిక్, కానీ ప్రస్తుతం అంతవరకు వెళ్లనక్కర్లేదు, ఎటువంటి హానికరం అయినా రసాయనాలు వాడకుండా తయారుచేసిన బెల్లం కూడా అ ఆరోగ్యకరంగానే ఉంటుంది.

కెమికల్స్ తో తయారుచేసిన బెల్లం వలన చాలా అనారోగ్యకరమైన పరిస్థితి నీ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కెమికల్స్ వాడే బెల్లం వలన ఉన్నవారికి షుగర్ లెవల్స్ పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం ఇలాంటివి చాలా ప్రాబ్లం ఎదుర్కోవలసి వస్తుంది, అంతే కాకుండా చిన్న పిల్లలు ఏం మధ్యకాలంలో బెల్లం తింటే మంచిది అంటున్నారని ఇంట్లో రకరకాల తినుబండారాలు చేసి పెడుతున్నారు, ఇందులో ఉన్న ప్రమాదకరమైన రసాయనాల వలన, నర్వస్ మీద అ తీవ్రమైన ప్రభావాన్ని చూపి, దీని వలన కంటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.అంతేకాకుండా సైనస్ ప్రాబ్లం ఉన్నవారికి అయితే , శ్వాసకు సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇలా చాలా రకాలైన రుగ్మతలకు కారణం అవుతుంది. అలా కాకుండా కొద్దిగా నలుపు రంగులో ఉండే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నట్లయితే, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎందుకు నలుపు రంగులో ఉంటుంది అంటే, రైతు తయారు చేసే ప్రాంతము, భూమి యొక్క సారం మీద ఆధారపడి ఉంటుంది.

ఈ రకాలైన బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే మంచి క్యాల్షియం గాని, ఖనిజాలు, మెగ్నీషియం ఇలాంటివి చాలా విలువైన పోషకాలు బెల్లం లో ఉంటాయి. ఈ బెల్లం తింటే ఎంత మంచిదో కెమికల్స్ తో తయారుచేసిన బెల్లం తింటే అంత హానికరం. ఈ ఆర్గానిక్ బెల్లం కి వినియోగదారుల నుండి పెద్దగా డిమాండ్ లేకపోవడం వలన గత్యంతరంలేని పరిస్థితులలో రైతులు కూడా దీని వైపు మొగ్గు చూపడం జరుగుతుంది.వినియోగదారులు కూడా బెల్లం మాకు తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి అని కాకుండా, శుభ్రమైన ది ఆరోగ్యానికి మంచి చేసేది కావాలి అని అడిగితే రైతులు కూడా ఖచ్చితంగా ఈ బెల్లం తయారు చేయడానికి శ్రద్ధ చూపిస్తారు. దీనివలన ప్రజల ఆరోగ్యానికే కాకుండా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.