ఈ మూడు వ్యాధులు ఉన్నవారు జామకాయలు అస్సలు తినకూడదు

అన్నీ సీజన్లలో అందుబాటులో ఉండే పండు జామకాయ . ఇది తెలుగులో జామ ,హిందీలో అమ్రుడ్ మరియు మరాఠీలో పెరూ అని పిలువబడుతుంది . ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలుతో నిండిన ఒక పండు . జామతో చేసే అమ్రుడ్ చట్నీ ,జామ్ లు మరియు మురబ్బా నోరూరించే వంటకాలు ఇవి ప్రకాశవంతమైన జామపండ్లతో తాయారు చేయబడతాయి.అతిఎక్కువగా పోషకాలు ఉన్న పండ్లలో జామకాయ ఒక్కటి . జామకాయను రక్తం తక్కువగా ఉన్నవాళ్లు తినడానికి ప్రాధాన్యత ఇస్తారు .జామకాయ తినడం వళ్ళ మలబద్ధకం ఉండదు . ఆహరం తొందరగా జీర్ణం అవుతుంది .

ఇవి పండ్లు మాత్రమే కాదు ,మొత్తం గుండె ఆరోగ్యం ,జీర్ణ క్రియ మరియు రోగనిరోధక వ్యవస్థకు జామ కాయలు ఉపయోగకరంగా ఉంటాయి . పండ్లలో కూడా కొన్ని రసాయన సమ్మేళనాలు ఉన్నాయని మీకు తెలుసా అది కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది కాదు జామ పండ్లలో విటమిన్ సీ ,యాంటీఆక్సిడెంట్లు ,కెరోటిన్ మరియు పొటాషియంతో నిండి ఉంటాయి . జామ పండులో ,అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది . ఇది దాదాపు 80శాతం నీటిని కలిగి ఉంటుంది మరియు ఇది మిమ్మల్ని హైడ్రేషన్ గా ఉంచడంలో సహాయపడుతుంది . ఒక జామపండు తినడం వల్ల 112కాలరీలు 23గ్రముల కార్బోహైడ్రేట్స్ మరియు 9గ్రాముల ఫైబర్ ఉంటుంది .

జామను ఎవరు తినకూడదు ?


మీరు కడుపుబ్బరంతో బాధపడుతుంటే
:పచ్చి జామకాయలో విటమిన్ సీ మరియు ఫ్రక్టోజ్ అని పిలుచుకోవడం కష్టతరం చేస్తుంది . ఇది కడుపు ఉబ్బరానికి ,గ్యాస్ పెరగడానికి దారితీస్తుంది .


మీకు ప్రేగు సిండ్రోమ్ ఉంటె :జీర్ణ క్రియ మరియు మలబద్దకాన్ని తగ్గించడానికి జామ చాలా గొప్పది అయినప్పటికీ ,జామ తినడం మితిమీరితే మీ జీర్ణ వ్యవస్థకు భంగం కలుగుతుంది ,ప్రత్యేకించి మీరు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తో బాధపడుతుంటే మితంగా మాత్రమే తినాలి .


మధుమేహ వ్యాధిగ్రస్తులు :జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన పండ్లలో ఒకటిగా ప్రచారం చేయబడుతుంది . కానీ జామకాయ తీసుకుంటున్నప్పుడు . మీరు మీ రక్తంలో చెక్కర స్థాయిలను తనిఖీ చేసుకోవాలి . ఒక జామలో 9గ్రాముల సహజ చెక్కర ఉన్నందున ఎక్కువగా తినడం వల్ల మీ రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది .

*జామకాయలో విటమిన్ A ,విటమిన్ సి మరియు కెరోటిన్ ఎక్కువగా లభిస్తాయి .


*దంతాల నొప్పి ,గొంతు నొప్పి చిగుళ్లు నొప్పులను నివారిస్తుంది .


*ఇది షుగర్ వ్యాధికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది .


*మన చర్మం మృదువుగా ఉండటానికి సహకరిస్తుంది