ఒక్క ఆకు చాలు రక్తం మొత్తం శుభ్రం చేస్తుంది దురదలు తగ్గిస్తుంది

ఈ మధ్య కాలంలో ఔషధ మూలికలకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుంది . ఎందుకంటే ప్రజలు రసాయనాలతో నిండిన వాటికి బదులుగా సహజ పదార్దాలతో చేసిన ఔషధాలను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు . భారతదేశంలో విలువైన ఔషధ మూలికల సంపద వుంది . అందులో ఒకటైన కుప్పింటాకు అనేది ఆయుర్వేద మందులలో ఉపయోగించే ఔషధ మూలిక. ఈ మొక్కఉష్ణమండల దేశాలలో ఎక్కువగా పెరుగుతుంది . దీనిని కలుపు మొక్కగా భావిస్తారు .

ఆకలిఫా ఇండికాను, ఇండియన్ కాపర్ లీఫ్ ,మూడు సీడ్ మెక్యూరి మరియు ఇండియన్ రేగుట వంటి అనేక పేర్లతో పిలుస్తారు . ఈ మొక్కను తమిళంలో కుప్పై మేమి ,హిందీలో కుప్పిఖోక్లి మరియు సంస్కృతంలో హరితమంజరి అని పిలుస్తారు .

ఈ మొక్కలో ఫినోలిక్ కాంపౌoడ్స్ ,ఫ్లెవనాయిడ్స్ ,స్టెరాయిడ్స్ టానిన్స్ మరియు సపోనిన్స్ ఉన్నాయి .ఈ సమ్మేళనాలన్నీ యాంటెలింటిక్ ,భేదిమందు ,ఎక్స్ పెక్టరేంట్ ,యాంటీయాక్సిడెంట్స్ ,డీటాక్స్ ఏజెంట్ ,యాంటీ ఇంఫ్లమ్మెటరి మరియు ఇతర ప్రయోజనకరమైన లక్షణాలను అందిస్తాయి .

ఈ మొక్కయొక్క ప్రయోజనాలు

చర్మ సమస్యలకు చికిత్స
తమర ,పుండ్లు ,గాయాలు మరియు గజ్జి వంటి చర్మ సమస్యలకు కుప్పింటాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది . యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా మొటిమలు , మచ్చల చికిత్సలో కూడా వీటిని ఉపయోగిస్తారు . ఈ మొక్క యొక్క మూలాలు , ఆకులుతో చేసిన పొడినిగాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు . ఎందుకంటే ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్ వృద్ధిని నిరోధిస్తుంది .

రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది
ఈ మొక్కలో ఉండే పాలిఫెనాల్స్ మరియు స్టెరాయిడ్స్ ,డయాబెటిక్ నిరోధక లక్షణాలనుఅందిస్తాయి . ఈ సమ్మేళనాలు రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తాయి మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి .

కంటి ఇన్ఫెక్షన్ల చికిత్స
ఈ మొక్క యొక్క ఆకులను కంటి సంరక్షణ చికిత్స కోసం ఉపయోగిస్తారు సాధారణ కంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఆకు రసం లేదా ఆకులను నీటిలో కలిపి కంటి చుక్కలుగా ఉపయోగించవచ్చు .

Acalypha Indica Leaf, Style : Fresh, INR 50 / Kilogram by KPM EXIM from  Virudhunagar Tamil Nadu | ID - 4995430

గుండెని రక్షిస్తుంది
ఈ మొక్క క్రియాశీల జీవక్రియలను కలిగి ఉంటుంది . ఇది గుండె కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

గ్యాస్ట్రో -ప్రేగు సమస్యల చికిత్స
ఈ మొక్క యొక్క ఆకులు భేదిమందు లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అందువల్ల మలబద్దకానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

శ్వసకోశ సమస్యలకు చికిత్స
ఈ ప్లాంట్ లో ఉండే విభిన్న సమ్మేళనాలు ,ఫ్లెవనాయిడ్స్ ,స్టెరాయిడ్స్ దీనికి అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్ఫలమేటరి లక్షణాలు ఉంటాయి ఈ ఆకు రసం కఫం,ధగ్గు ,ఆస్తమా మరియు ఇతర శ్వస సంబంధ సమస్యలలో వాడుతారు .

సౌందర్య ప్రయోజనాలు
ఈ మొక్క ఆకులను అవాంఛిత రోమాలు తొలిగించడం వంటి సౌందర్య ప్రయోజనాల కోసం వాడుతారు . ఈ మొక్క ఎండిన ఆకులు మరియు గోరువెచ్చని నీటితో కలిపి తాయారు చేసిన మిశ్రమాన్ని చర్మం పై అప్లై చేస్తే కొంతకలం తరువాత అవాంఛిత రోమాలు తొలిగి పోయేలా చేస్తుంది .