ఈ సంవత్సరం మొదటి వారం.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే..

కొత్త సంవత్సరం రానే వచ్చింది. కొత్త కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు ప్రజలు. ఈ సంవత్సరం కూడా బాగా గడవాలని కొందరు, కనీసం ఈ సంవత్సరం అయినా బాగా గడవాలని ఇంకొందరు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం ఎవ్వరికి ఎలా ఉండబోతోంది? ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? అని తెలుసుకోవటం చాలా కష్టం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ద్వారా మన రాశులను బట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని ముందే తెలుసుకోవచ్చు. జనవరి నెలలో 2వతేదీ నుంచి 8వ తేదీ వరకు వార ఫలాల ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే..

మేష రాశి:-

వీరికి మొదటి వారం అద్భుతంగా గడుస్తుంది. ఈ వారంలో అదృష్టం వరించే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే ఆడవారికి వర్క్‌ ప్లేస్‌లో, ఇంట్లో తగిన గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఎలాంటి లోటు రాదు. ప్రేమ వ్యవహరాల్లో వీరు మంచి ఫలితాలను పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.

కలిసొచ్చే రంగు : నీలం
కలిసొచ్చే సంఖ్య : 6

వృషభం :- ఈ రాశి వారికి భూమి సంబంధ పనుల్లో విజ్ఞాలు తొలగిపోతాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ఉన్నత బాధ్యతలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. వీరు కుటుంబంతో కూడా మంచిగా గడుపుతారు. సీజనల్‌ వ్యాధుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి.

కలిసొచ్చే రంగు : ఎరుపు
కలిసొచ్చే సంఖ్య : 3

మిధునం :- వీరికి ఈ వారం అంతగా కలిసిరాకపోవచ్చు. వ్యాపారంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఏ పనైనా చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయటం ఉత్తమం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఓ అడుగు ముందుకు వేయటానికి భాగస్వామి ఎలాంటి మూడ్‌లో ఉందో ఓ అంచనాకు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలి.

కలిసొచ్చే రంగు : ఆకుపచ్చ
కలిసొచ్చే సంఖ్య : 11

కర్కాటకం:- ఈ వారంలో వీరికి ధీర్ఘకాలిక వ్యాధుల కారణంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. డ్రైవింగ్‌ విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి.. సేఫ్టీ పాటించాలి. వ్యాపారస్తులకు కూడా ఈ వారం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే.. భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. వైవాహిక జీవితం అనుకున్న దానికంటే ఆనందంగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సంశయం లేదు.

కలిసొచ్చే రంగు : తెలుపు
కలిసొచ్చే సంఖ్య : 4

సింహ రాశి:- ఈ రాశి వారికి ఈ వారం అంతా మేలు జరుగుతుంది. కొన్ని పెద్ద సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. వీరు నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ప్రేమించిన వారితో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. భార్యాభర్తల బంధం ఎంతో సాఫీగా సాగుతుంది.

కలిసొచ్చే రంగు : నారింజ రంగు
కలిసొచ్చే సంఖ్య : 7

కన్య రాశి:- ఈ రాశి వారికి ఈ వారం కొంచెం కష్టం.. కొంచెం ఇష్టంగా గడుస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అనుకోని సమస్యల కారణంగా మనసు ఇబ్బందులకు లోనవుతుంది. చిన్న పనికి కూడా కొన్ని సార్లు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. ఇక, భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉంటుంది.

కలిసొచ్చే రంగు : లేత ఎరుపు రంగు
కలిసొచ్చే సంఖ్య : 14

తుల రాశి:-ఈ రాశి వారికి ఈ వారం ఎంతో ఫలదాయకంగా ఉంటుంది. కుటుంబంతో, బంధు మిత్రులతో సంతోషకర క్షణాలను గడుపుతారు. వరుస ప్రయాణాలతో సంతోషకర క్షణాలను గడుపుతారు. అన్ని వర్గాల వారికి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కూడా మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత నెలకొంటుంది.

కలిసొచ్చే రంగు : గోధుమ రంగు
కలిసొచ్చే సంఖ్య : 17

వృశ్చికం:-ఈ రాశి వారికి ఈ వారం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా గడుస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఏదో ఒక విషయంపై మనసులో ఆందోళన చెందుతూ ఉంటారు. పనుల్లో ఆశించిన సహకారం అందదు. అదనపు శ్రమ పడాల్సి వస్తుంది. వ్యాపారులకు కూడా ఈ వారం ఆశాజనకంగా ఉండదు. ఈ రాశి వారు ప్రతీ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

కలిసొచ్చే రంగు : బంగారు రంగు
కలిసొచ్చే సంఖ్య : 14

ధనస్సు:-ఈ రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పని చేసే చోట తగిన గౌరవం లభిస్తుంది. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితురాలి చొరవ కారణంగా ప్రేమ వ్యవహారంలో మంచి ఫలితం లభిస్తుంది. కోరుకున్న వారితో ఉన్న అపార్థాలు తొలగి, మంచి సఖ్యత లభిస్తుంది. భార్యాభర్తలకు కూడా ఈ వారం అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది.

కలిసొచ్చే రంగు : ఊదా
కలిసొచ్చే సంఖ్య : 7

మకర రాశి:-ఈ రాశి వారికి ఈ వారం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది. వారం మొదట్లో మంచిగా ఉన్నా తర్వాత కొన్ని అనుకోని ఇబ్బందులు వస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రాశి వారు తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇలా జరగాలంటే భాగస్వామి చెప్పిన విషయాలకు గౌరవం ఇవాల్సి ఉంటుంది.

కలిసొచ్చే రంగు : లేత గులాబి రంగు
కలిసొచ్చే సంఖ్య : 1

కుంభం:- ఈ రాశి వారు ఎప్పటిలాగే పనుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మొదలు పెట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధించటానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు కొంచెం గడ్డుకాలం నడుస్తుంది. ప్రత్యర్థులనుంచి పోటీ పెరిగే అవకాశం ఉంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. జూదం, లాటరీ వంటి వాటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో మాత్రం వీరికి మంచి జరుగుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం అనందంగా గడుస్తుంది.

కలిసొచ్చే రంగు : పసుపు
కలిసొచ్చే సంఖ్య : 5

మీనం:- ఈ రాశి వారికి ఈ వారం మొత్తం ఎంతో సంతోషంగా గడుస్తుంది. అన్ని విషయాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లు మంచి గౌరవం లభిస్తుంది. కుటుంబసభ్యులు, బంధు, మిత్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమ విషయంలోనూ మంచి ఫలితాలు ఉంటాయి. ఇద్దరి మధ్యా బంధం మరింత బలపడుతుంది. భార్యాభర్తల బంధంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

కలిసొచ్చే రంగు : నలుపు
కలిసొచ్చే సంఖ్య : 18