ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచే మెడికల్ డ్రింక్

కొంతమందికి పుట్టుకతో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి కఫం, శ్లేష్మం వచ్చి కూడా తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కొంతమంది ఆస్తమాతో, బ్రోచిట్స్, వైరల్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులలో కణజాలం దెబ్బతింటుంది. దీనివలన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, ఆయాసం, మునుపటిలా లేకుండా నీరసంగా ఉండడం. లంగ్స్ రేట్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ రేట్ తక్కువ ఉండి ఆక్సిజన్ రేటు పెరగడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ఈ డికాషన్. ఈ 5 పదార్ధాలతో డికాషన్ చేసుకుని తాగినట్లయితే ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది.

వాటిలో మొదటిగా అల్లం జింజిరాల్స్, సోగయాల్స్ అనేక రసాయనిక కాంపౌండ్ వల్ల ఊపిరితిత్తులలో గాలిగొట్టాల వెడల్పు పెరిగి ఆక్సిజన్ రేటు పెరిగేలా చేస్తుంది. క్యాల్షియం చానల్స్ వంటివాటిలో కూడా మార్పులు తీసుకొచ్చి ఫ్రీగా వెళ్ళేటట్లు గాలి వ్యాకోచించేటట్లుగా చేస్తుంది. అల్లం వల్ల ఇలాంటి ఉపయోగం ఉంది అని కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారు నిరూపించారు. రెండవది వాము. దీనిలో థైవాల్, కార్వాక్రోల్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. గాలి తిత్తులు వ్యాకోచించడానికి హిస్టమిన్ ప్రొడక్షన్ తగ్గించడానికి వాము చాలా బాగా పనిచేస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సిజన్ వంటివి శుభ్రపరిచేది వాము లో ఉండే కెమికల్ కాంపౌండ్స్.గాలిగొట్టాలు వ్యాకోచంపచేస్తోందని నిరూపించిన వారు మస్సాద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు. మూడవది పుదీనా. పుదీనా లంగ్స్ లో ఉండే వాపులను తగ్గిస్తుంది. కఫం శ్లేష్మం వచ్చినప్పుడు బయటకు రావడానికి పుదీనా బాగా ఉపయోగపడుతుంది.పుదిన లేనప్పుడు మింట్ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.

పుదీనా ఊపిరితిత్తులలో వాపులను తగ్గిస్తుంది అని యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వాళ్లే చూపించారు.నాల్గవది అతిమధురం. దీనిలో ఉండే గ్లిసిజేరిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని నిరూపించబడింది. మూడు వందల మంది ఆస్తమా ఉన్నవారికి మీద దీన్ని ప్రయోగిస్తే 25 శాతం మందికి బ్రీతింగ్ సమస్య తగ్గింది. అతిమధురం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఐదవది మిరియాలు వీటిలో ఉండే పెప్పేరిన్ అనే పదార్థం లంగ్స్ లో రిలీజయ్యే cytokines మరియు హానికలిగించే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తొలగించి లవర్స్ లో ఉండే ఖనిజాలు ఏదైతే ఉందో అది ఇన్ఫ్లమేషన్ వలన పాడవకుండా కాపాడుతుంది. ఈ 5 పదార్థాల డికాషన్ చేసుకుని తాగినట్లయితే కపం, శ్లేష్మం తగ్గి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.