ఎటువంటి సమయంలో డయాలసిస్‌ చేస్తారు ….

ఇటువంటి సమయంలో డయాలసిస్ చేస్తారు? రక్తాన్ని వడపోసి మలినాలను, విషంలను విసర్జించడానికి మూత్రపిండాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటి పనితీరు మందగిస్తే కృత్రిమ పద్ధతుల్లో ఆ పని జరిపించ వలసి ఉంటుంది. లేదంటే ఒంట్లో వ్యర్ధాలు పేరుకుపోతాయి డయాలసిస్ ద్వారా ఆ ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రతి రోగి డయాలసిస్ అవసరం కాకపోవచ్చు తాత్కాలిక వైఫల్యం అయినా శాశ్వత వైఫల్యం అయినా మొదట మందులతోనే చికిత్స చేస్తారు ,పూర్తిగా మొరాయించిన అప్పుడు మాత్రం తప్పదు. కిడ్నీ దెబ్బతినే ప్రతి ఒక్కరికి డయాలసిస్ తప్పదు అనుకోకూడదు సిరమ్ క్రియాటిన్ అనే శరీరంలోనీ వ్యర్థ పదార్థం కిడ్నీల పనితీరు దెబ్బతినడంతో ఒంట్లో పేరుకుపోతుంది. ఇది హానికర పరిణామం అలానే రక్తంలో క్రియటిన్ శాతం పెరిగినంత మాత్రాన డయాలసిస్ అవసరం కాకపోవచ్చు. అన్నిసార్లు డయాలసిస్ అనేది క్రియాటిన్ శాతం పై ఆధారపడి ఉండదు . రోగి పరిస్థితి స్థిరంగా ఉండే రక్తంలో పొటాషియం ఆమ్లాలు నియంత్రణలో ఉన్నప్పుడు శ్వాస సమస్యలు లేకుండా ఆకలి సరిగా ఉన్నప్పుడు సీరం క్రియాటిన్ 10 శాతం ఉన్న డయాలసిస్ అవసరం కాకపోవచ్చు.

అలా కాకుండా రోగి ఆరోగ్యం నిలకడగా లేకుండా రక్తంలో పొటాషియం పెరిగిపోయినప్పుడు లేదా కిడ్నీ తో పాటు గుండె పనితీరు తగ్గినప్పుడు సీరం క్రియాటిన్ తక్కువగా ఉన్నా కూడా అనివార్యం అవుతుంది. శరీరం లో వ్యర్ధాలు బాగా పేరుకుపోయి ఊపిరితిత్తులలో నీరు చేరినప్పుడు డయాలసిస్ మినహా వేరే మార్గం లేదు. మందులకు కూడా తగినంత స్థాయిలో రక్తంలో పొటాషియం ఆమ్లాలు పేరుకుపోయిన ప్పుడు రక్తంలో పెరిగిపోయిన సిరమ్ క్రియాటిన్ శరీరంలోని ఇతర భాగాల పనితీరు మీద దుష్ప్రభావం చూపించినప్పుడు రక్తంలో విషపూరిత పదార్థాలు పెరిగిపోయి ఆకలి పూర్తిగా తగ్గిపోయినప్పుడు తప్పనిసరి. మూత్రపిండాల రోగులు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాలి అనుకోవడం సరికాదు. మూత్రపిండాలు తాత్కాలికంగా వైఫల్యం చెందిన వారు నెల నుండి రెండు నెలల పాటు చేయించుకుంటే సరిపోతుంది. విధి నిర్వహణలో తాత్కాలికంగా విఫలమైన మూత్రపిండాలు మళ్లీ శక్తిని పుంజుకునేoతవరకు డయాలసిస్ వ్యవస్థ బాధ్యత నిర్వహిస్తోంది. నీ సర్దుకున్నాక డయాలసిస్ తో పనిలేదు శాశ్వతంగా కిడ్నీలు విఫలమైనా వారికి మాత్రం జీవితాంతం తప్పదు. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా మూత్రపిండ మార్పిడి చేయించుకుంటే డయాలసిస్ ను పక్కన పెట్టవచ్చు.

డయాలసిస్ రెండు రకాలు హీమో డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ లో ఎంట్రెన్స్ సహాయంతో రక్తాన్ని శుద్ధి చేస్తారు రోగికి రక్తనాళాల్లోకి సన్నటి పైపును అమర్చడం ద్వారా లేదా హోమైనో సర్జరీ ద్వారా రక్తాన్ని డయాలసిస్ యంత్రానికి పంపు చేసి శుద్ధి చేస్తారు. హెమోడియాలిసిస్ కోసం రోగి వారంలో రెండు మూడు సార్లు హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ లో రోగి హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనిలేదు ఇంట్లోనే అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, దూరప్రయాణాలు చేయాల్సినప్పుడు రైలు బస్సు విమానాలలో కూడా డయాలసిస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతుల్లో రక్తం సహజ పద్ధతిలో శుద్ధి అవుతుంది రోగి నాభి కింద ఒక ట్యూబ్ అమరుస్తారు. ఈ ట్యూబ్ కి పెరటోనియల్ బ్యాగ్ జత చేస్తారు. ఇందులో రెండు సంచులు ఉంటాయి, ఒక సంచిలో రెండు లీటర్ల పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, మరొక సంచి ఖాళీగా ఉంటుంది. ఈ వ్యవస్థను రోజుకి కడుపులోని ట్యూబ్ కి కనెక్ట్ చేసినప్పుడు కడుపులోని నీరంతా ఖాళీ బ్యాగ్ లోకి వచ్చి చేరుతుంది. ఈ ప్రక్రియలో కడుపులోని పెరిటోనియల్ జల్లెడలాగా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రక్తాన్ని సహజ పద్ధతిలో కడిగేస్తుంది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజు మూడు సార్లు చేసుకోవాలి.