ఒంట్లో హీట్ తో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్ ని తగ్గించే 3 మార్గాలు ఇవి ….

యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్,ఈ ఇన్ఫెక్షన్ అనేది మగవారితో పోలిస్తే ఆడవారిలో వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే స్త్రీలు మంచి నీరు సరిగ్గా తాగకపోవటం చాలా తక్కువగా తాగుతారు.పురుషులతో పోలిస్తే. ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపార నిమిత్తం బయటికి వెళ్లడం వల్ల అక్కడ ఉంటే స్పెస్లిటీస్ ని దృష్టిలో పెట్టుకుని, ఎక్కువగా వెళ్లాలంటే నలుగురిలో, అక్కడ సదుపాయాలు సరిగా లేవు అని దృష్టిలో పెట్టుకొని నీళ్లు తక్కువగా తాగడం చేస్తూ ఉంటారు.దాని వల్ల యూరిన్ తక్కువగా వస్తుంది. అది వేడి గా వస్తుంది ఎందుకంటే కిడ్నీలు బ్లడ్ లో ఉండేటటువంటి వ్యర్థాలు టాక్సిన్స్ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ని యూరియా ని ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ ని అన్నిటినీ తీసుకువచ్చి యూరిన్ లో పెడుతుంది.నీళ్లు ఎక్కువగా ఉంటే ఇవన్నీ కలిసే సరికి డైల్యూటెడ్ యూరిన్ నుండి ఘాటు ఉండదు. అలాగే తక్కువ నీళ్లల్లో ఎక్కువ కలిసినవి అనుకొండి ఘాటు పెరిగిపోతుంది.

మరి ఇలాంటి మహిళలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడానికి ఏదైనా స్పెషల్ గా ఉంటాయా అని ఆలోచిస్తే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి ఉపయోగపడే ఇమ్యూనిటీని బూస్ట్ చేసే వి ఏవైనా ఉంటాయా అంటే, మూడు ఇన్ఫెక్షన్స్ పైన ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి ఏమిటంటే 1 బీటో సైటో స్టిరాల్ 2.కాంపి స్టీరాల్ 3. వాలనిక్ ఆసిడ్స్.ఈ మూడు UTI ఇన్ఫెక్షన్స్ని పోరాడడానికి ఇమ్మ్యూనిటి ని బాగా బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ నిరూపించారు. ఈ మూడు ఎక్కువ మోతాదులో లోపలికి వెళితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి రాకుండా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.మరి ఇందులో ఎక్కువగా ఉంటాయి అంటే కొండపిండి ఆకు లో బాగా ఉంటాయట, అందుకనే స్పెషల్గా కొండపిండి ఆకు పైన పరిశోధన చేసి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా స్త్రీలకి ఈ కొండపిండి ఆకు రక్షిస్తుంది బాగా అని నిరూపించిన వారు 2012వ సంవత్సరంలో, యూనివర్సిటీ ఆఫ్ కొలంబో శ్రీలంక ఈ పరిశోధన చేశారు.

అందుకనే అందరికీ ఎక్కడపడితే అక్కడ కొండపిండి ఆకు దొరుకుతూ ఉంటుంది పల్లెటూర్ల తో సహా. అలాంటివారు దాన్ని అట్లా మరిగించి డికాషన్ లాగా చేసుకొని త్రాగవచ్చు, లేనప్పుడు ఈ కొండపిండి ఆకు పొడి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు.ఇది తక్కువ రేట్ లో దొరుకుతుంది దీనిని ఒక స్పూన్ పొడి తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకొని తాగితే చేయవచ్చు వేడినీళ్లలో. లేదంటే వేడినీళ్లలో ఒక స్పూన్ వేసి మరిగించి కూడా తాగవచ్చు, అంటే తరచు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు ఒక సారి వచ్చింది, మళ్ళీ రాకూడదు అంటే దీనిని ఉపయోగించండి. స్త్రీలు ఇలాంటివి వాడుకోవడం చాలా మంచిది కానీ ఎన్ని వాడిన కాస్త నీళ్లు ఎక్కువగా తాగడం, యూరిన్ తెల్లగా వచ్చేటట్టు జాగ్రత్తపడండి. మీ కంటికి ఎప్పుడు వేరే కలర్ లో కనపడకూడదు ఎప్పుడూ తెల్లగా యూరిన్ వచ్చేలా జాగ్రత్తపడండి….