నిమ్ము కఫము వెంటనే పోవాలంటే ఇది ఒక్కటి చాలు….

ఈరోజు మనం కఫం యొక్క సమస్య, అంటే చాలా మందికి ముక్కులో, గొంతులో, ఛాతిలో, కఫం పేరుకొని పోవటం వల్ల వచ్చే ఇబ్బందులను తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి,ఈ పేరుకు పోయిన కఫాన్ని బయటకు పంపించడానికి ఆయుర్వేదంలో ఒక మంచి పరిష్కారాన్ని చూద్దాం!దీని కోసం కావాల్సిన మూలికలు ఏమిటంటే మొదటిది సొంటి, సొంటి అనేది అందరికీ తెలిసిందే,ఈ సొంటి పొడి ని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనకు కావలసినవి పీపల్ పొడి, నల్ల మిరియాలను కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి, తర్వాత సైంధవ లవణం, ముందుగా వీటన్నిటిని కూడా సమాన నిష్పత్తిలో తీసుకోవాలి.

ఉదాహరణకు సొంటి పొడి ఒక టీ స్పూన్, మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్, పీపల్ పొడి ఒక టీ స్పూన్, సైంధవలవణం పావు టీ స్పూన్ తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపేయండి. తర్వాత వీటికి కొద్దిగా అల్లం రసాన్ని కలిపి ఒక ముద్ద అయ్యేలా చేసుకోండి, దీన్ని అలాగే వేడి చేయండి, ఇలా వేడి చేసిన తర్వాత ఆ ముద్దని నోట్లో బుగ్గ లో పెట్టుకోవాలి, దీన్ని ఇట్టి పరిస్థితిలో మింగకూడదు, ఈ రసాన్ని కూడా మింగకూడదు, ఇలా చేయడం వల్ల ఈ మూలికల యొక్క ఎఫెక్ట్ వల్ల ముక్కులో పేరుకుపోయిన కఫం అనేది బయటికి వస్తుంది, అలాగే గొంతులో ఉన్న కఫము కూడా తగ్గిపోతుంది, ముఖ్యంగా చాతిలో రకరకాల సమస్యల వల్ల కఫం పేరుకుపోతుంది, ముఖ్యంగా నిమోనియా అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఛాతిలో కఫం పేరుకుపోతుంది.

లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జీ స్ వల్ల కాని కఫం పేరుకుపోతుంది, దీని వల్ల దగ్గు రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, శరీరమంతా బరువుగా ఉండడం ఏ పని చేయాలని అనిపించకుండా బద్ధకం పెరిగిపోవడం, ఈ కఫం ఎప్పుడు బయట పడుతుందా మనం ఎప్పుడు రిలీఫ్ అవుతామా అనే ఫీలింగ్ ఉంటుంది, ఇలాంటి సమస్య కి ఇప్పుడు చెప్పిన పద్ధతిని పాటిస్తే శరీరంలో ఉండే కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. మీకు ఈ సమస్య ఎక్కువగా ఉంటే దీనిని రోజుకు 4 నుండి 6 సార్లు ఈ విధంగా చేయండి, మధ్యస్తంగా ఉంటే నాలుగు సార్లు చేయండి, మామూలుగా ఉంటే రోజుకో రెండు మూడు సార్లు చేయాలి, కఫం పూర్తిగా తగ్గిపోయే వరకు కూడా దీనిని చేయవచ్చు, దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కఫం మొత్తం కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది, దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఈ మందులు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే కఫం అనేది నోట్లోకి వస్తుంది దానిని మింగకుండ వుమ్ముతూ ఉండాలి, దీనివల్ల కఫం అంతా బయటికి వెళ్ళి పోయి శరీరమంతా తేలికగా అవుతుంది.