ఒక్కసారి వాడితే చెవులు ఎప్పటికి శుభ్రంగా ఉంటాయి…

ఈరోజు మనం వావిలాకు మరియు వావి చెట్ల గురించి తెలుసుకుందాం. వావిలి చెట్లు అనేది భారతదేశంలో తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లలో అన్ని గ్రామాల యందు విరివిగా కావలసినంత పెరుగుతూ ఉంది. ఈ మొక్కను కొద్దిగా కొమ్మ తీసుకుని భూమిలో నాటినట్లయితే అది ఒక మంచి చెట్టులా తయారవుతుంది. దీని యొక్క ఉపయోగాలు ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి, ముఖ్యంగా ఈ వావిలి అనేది ఒక మంచి అగ్ని దీపనం, అలాగే కఫా, వాత దోషాలను కంప్లీట్ గా తగ్గిస్తుంది. కఫము ప్లస్ వాతము, అనేది ప్రతి వ్యాధిలో కూడా ఎక్కువగా ఉంటాయి, ఈ అన్ని వ్యాధులందు కూడా ఈ వావిలాకు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి అడవి వావిలి అలాగే మనకు గ్రామాల్లో మామూలుగా దొరికే తెల్ల వావిలి అంటారు , ఈ రెండిట్లో కూడా నల్ల వావిలి అని మరొకటి ఉంటుంది దీంట్లో వాటి ఆకులు, కాడలు అన్ని కాస్త నల్లగా ఉంటాయి, ఇది అరుదుగా దొరుకుతుంది.

ఇది ముఖ్యంగా వాతాన్ని హరిస్తాయి, ఇలా వాత దోషాలే కాకుండా రకరకాల స్కిన్ డిసీజెస్ అంటే అన్ని చర్మ రోగాల యందు దీని యొక్క ఉపయోగo విశేషంగా చెప్పడం జరిగింది. ప్రతి స్కిన్ డిసీజెస్ లో దీన్ని అప్లై కానీ లేపనం కానీ దీని రసం తీసుకుని త్రాగడం కానీ చేసినట్లయితే కంప్లీట్ గా కుష్టు రోగాలు , అలాగే అజీర్ణం అంటే సమస్యలలో కూడా ఇదే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్నాయువు , స్నాయువు అంటే ఒక బొక్కకి మరొక బొక్కకి మధ్య ఒక కార్టీలేజ్ లాంటిది ఉంటుంది, దీనియందు కూడా దీని యొక్క రసం తీసుకుని కొద్దిగా తేనె కలుపుకొని ఒక పది పదిహేను రోజులు కనుక త్రాగినట్లయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సయాటికా వంటి వాటి యందు కూడా ఒక వారం రోజులపాటు దీని ఆకులను సేకరించి, శుభ్రంగా కడిగి ఒక 50 ml రసం తీసుకుని పొద్దున ఒక 50 ml సాయంత్రం ఒక 50 ml త్రాగినట్లయితే ఒక వారం రోజుల లోపే నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది.

ఈ ఆకులు తీసుకువచ్చి శుభ్రపరచి రసాన్ని తీసి ఆ రసాన్ని కాస్త వేడి చేసి ఆ రసాన్ని ఉదయం సాయంత్రం ఒక 15 రోజులు కనుక త్రాగినట్లయితే పామా,కుష్టురోగాలు, దద్దురు చిన్న చిన్న కురుపులు, వంటి వాటికి బాగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా చెవిలో పోటు చెవిలో నొప్పి తర్వాత చెవిలో చీము కారడం వీటి యందు ఈ ఆకులను తీసుకొని దంచి దానికి కొద్దిగా నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి ఆ నూనె మాత్రం ఒక పది రోజులు ఆ చెవిలో 8 చుక్కలు, ఈ చెవిలో 8 చుక్కలు చెవిలో వేసినట్లయితే చెవిపోటు, చెవి నొప్పి, చెవి దురద, చీము కారడం వంటి వాటికి కూడా వావిలి చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా బాలింతలకు వీటిని వేడి నీటిలో వేసి మరిగించి బాగా మరిగిన తర్వాత ఆ నీటి తోటి స్నానం చేసినట్లయితే భయంకరమైన వాత రోగాలు కంప్లీట్ గా తగ్గడమే కాకుండా గర్భసంచి లో ఉన్నటువంటి సమస్యలు కూడా కంప్లీట్ గా తగ్గిపోతాయి.