పిప్పి పన్ను పోటుకి శాశ్వత పరిష్కారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే చాలు.

పిప్పి పన్నులాగితే విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధను తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. పూర్వం ఈ పన్నుతో బాధపడే వారికి పెద్ద వాళ్ళు చెప్పిన చిట్కా ఇంగువ. ఇంగువను చిన్న చిన్న పొడిగా చేసి, ఆ పొడిని పిప్పి పన్ను ఉన్న గుంత లోపలికి వెళ్లినట్టు చేయాలి. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు దంతాల్లో జివ్వుమని లాగడం మొదలవుతుంది. దీని కారణంగా దంతాలు కూడా పగిలిపోతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి తీవ్ర పంటి నొప్పి సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా దవడలు ఉబ్బుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఒక పన్ను నుంచి ఇతర పంటికి నొప్పి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వులను వినియోగించాల్సి ఉంటుంది:- దంతాల సమస్యలతో బాధపడేవారు ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వులను వినియోగించవచ్చు.

పిప్పి పన్ను ఉన్న చోట నువ్వులతో తయారు చేసిన మిశ్రమాన్ని పిప్పి పన్ను ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా చేసిన రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే గొప్ప ఉపశమనం లభిస్తుంది. నువ్వులను ఇలా వినియోగించండి:- జలదరింపు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా చెంచా నువ్వులను గ్రైండ్ చేసి..గోరు వెచ్చని నీటిలో వేసి బాగా పుక్కిలించి ఉంచాల్సి ఉంటుంది.

ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా పంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. చిగుళ్ళలో రక్తస్రావం సమస్యలకు చెక్‌:- చిగుళ్ళలో రక్తస్రావం, వాపు, నొప్పి సమస్యలతో బాధపడేవారికి ఈ చిట్కా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల పళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తప్పకుండా నువ్వులను వినియోగించాల్సి ఉంటుంది.

Add Comment