ఒక్క ఆకుతో నీరసం గ్యాస్ ఒబిసిటీఅలసట కీళ్ల నొప్పులు షుగర్ అన్నీ మాయం

ఇప్పుడు  చిన్నవయసులోనే క్యాల్షియం లోపం వచ్చి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు  వస్తున్నాయి.  నీరసం, అలసట తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉంచడానికి  ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం తమలపాకుని  కిల్లి చేసుకొని తినడానికి మాత్రమే ఉపయోగిస్తాము. తమలపాకులు సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకుని ఆయుర్వేదంలో దివ్యౌషధంగా  చెప్తారు.తమలపాకు శరీరంలో  ఇమ్యూనిటీపవర్ పెంచుతుంది. తరచు నీరసం, అలసట, విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటే ఈ ఎనర్జీ డ్రింక్ చేసుకుని తాగితే  నొప్పులన్ని వెంటనే తగ్గుతాయి. స్టౌవ్  మీద గిన్నె పెట్టి  గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి నీటిలో రెండు లేదా మూడు తమలపాకులను  చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

ఈ నీళ్లు ఒక గ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. నీళ్లు వడకట్టుకొని వేడిగా ఉన్నప్పుడే టీ  తాగినట్లు తాగాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేసి  అలిసిపోయి ఉన్నప్పుడు ఈ నీళ్లు తాగడం వల్ల  అలసట తగ్గుతుంది. విపరీతమైన తలనొప్పి కూడా తగ్గుతుంది. ఒత్తిడి వలన వచ్చే అలసట, నీరసం కూడా తగ్గుతాయి.కాళ్లు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు,  ఎముకలలో నొప్పి వచ్చినప్పుడు  తమలపాకుకి  గోధుమ గింజంత సున్నం రాసుకొని  రోజు తినడం వలన క్యాల్షియం లోపం తగ్గి  ఎముకలు  దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ల నొప్పులు, వెన్నునొప్పి తగ్గుతాయి.

డైరెక్టుగా తమలపాకు తినలేని వాళ్ళు తమలపాకుతో తయారు  చేసిన  నీటిలో గోధుమ గింజంత సున్నం కలుపుకొని తాగడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గి యాక్టివ్గా ఉంటారు. రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి తగ్గిపోతాయి.ప్రస్తుతం అందరికీ బాధిస్తున్న సమస్య  ఒబేసిటీ. ఒక  తమలపాకు తీసుకొని  నాలుగు లేదా ఐదు  నల్లమిరియాలు వేసి నమిలి తినడం వలన అధిక బరువు తగ్గుతుంది.  గ్యాస్, జీర్ణ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయాన్నే ఒక తమలపాకు తినడం వలన ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీని వల్ల గ్యాస్,  ఎసిడిటీ తగ్గుతాయి.

Tamalapaku - Betel Leaf | Plant leaves, Leaves, Plants

తమలపాకు  జీర్ణ వ్యవస్థను బలంగా తయారు చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తమలపాకు తినడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి  వస్తుంది. డయాబెటిస్ వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించడంలో తమలపాకు బాగా పనిచేస్తుంది. తమలపాకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు  దరిచేరవు. రక్తాన్ని శుభ్ర పరచడంలో కూడా తమలపాకు బాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజెస్ రావడం తగ్గుతుంది. తమలపాకు కషాయం తయారు చేసుకునేటప్పుడు దాన్లో రెండు వెల్లుల్లి రెబ్బలు, చిన్న  అల్లంముక్క  వేసి మరిగించుకోవడం వలన  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ఇలా తాగలేము అనుకునేవారు తమలపాకు తీసుకుని దాన్లో రెండు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుని  తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  తమలపాకు క్యాన్సర్ నివారణలో కూడా బాగా ఉపయోగపడుతుంది.