నవంబర్ 4 దీపావళి అమావాస్య రోజు తెల్ల జిల్లేడు పూలతో ఇలా చేస్తే పేదవాడైనా రాజ్యమేలుతాడు

తెల్ల జిల్లేడు దేవతా వృక్షం అని దీని పూలతో వినాయకుని పూజిస్తే అష్టైశ్వర్యాలు అందిస్తాడని మనందరికీ తెలుసు. అయితే ఈ దీపావళి రోజు తెల్ల జిల్లేడు పూలతో ఎలా పూజిస్తే ఆ దేవి మనకు సకల శుభాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.తెల్ల జిల్లేడు చెట్టులో పరమశివుడు నివసిస్తాడని చెబుతారు. తెల్ల జిల్లేడు పువ్వులు శ్వేతార్కం అని పిలుస్తారు. శ్వేతార్క గణపతి అంటే జిల్లేడు చెట్టు వేరును ఇంట్లో పెట్టుకోవడం వల్ల గణపతి యొక్క దయ మన పై ఉంటుందని పండితులు చెబుతున్నారు. తెల్లజిల్లేడు వేరును ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.

తెల్ల జిల్లేడు ఆకులతో ఆంజనేయస్వామికి మాలలు వేస్తారు. తెల్ల జిల్లేడు పుల్లతో గణపతిని పూజించడం వలన కుజదోషం, శని దోషం పోతుంది. స్వామి వారు కలలో కనిపించి సాక్షాత్కరిస్తారు. తెల్ల జిల్లేడు చెట్టు ఇంటి ముందు పెంచుకోవడం వలన ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. ఈ చెట్టు చాలా అరుదుగా కనిపిస్తుంది.ఇంటిముందు పెంచుకోవడం వల్ల గణపతి యొక్క దయ ఇంటిపై ఉంటుంది. దానికి కారణం 12 సంవత్సరాలు తెల్ల జిల్లేడు చెట్టును పెంచడం వలన దాని వేరు స్వయంభు విగ్నేశ్వరుని రూపంలోకి మారుతుంది. షాపులో దొరికే తెల్లజిల్లేడు వేరు కాండంతో తయారు చేస్తారు గనుక సొంతంగా చెట్టును పెంచుకోండి.

ఆ చెట్టు వేరు ఇంట్లో పెట్టుకోవడం మంచిది. తెల్ల జిల్లేడు కార్తీక సోమవారం రోజు విఘ్నేశ్వరుడికి అలంకరిస్తే భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. నిండు నూరేళ్లు భర్త క్షేమంగా ఉండాలని భావించి స్త్రీలు ఇలా భర్త చేత విఘ్నేశ్వరుడికి పూజ చేయించాలి. తెల్ల జిల్లేడు చెట్టు ఇంటి ముందు ఉండడంవలన విజయం మీ సొంతమవుతుంది.తెల్ల జిల్లేడు ఆకులను ప్రాణప్రతిష్ఠ చేసి పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దానికోసం ఒక పట్టుజాకెట్టు ముక్క నలుపు తప్ప ఏ రంగు జాకెట్ ముక్కలోనైనా ఒక తెల్ల జిల్లేడు ఆకు, వేరులు పెట్టి వెండి లేదా ఇత్తడి ప్లేట్లో ఆ క్లాత్, ఆకులకు తెల్ల అక్షతలతో పూజ చేయాలి.

దానిపై పచ్చ కర్పూరం వేసి 21 రోజులు 41 రోజులు లేదా 108 రోజులపాటు పూజించి అక్షతలను ఏదైనా డబ్బాలోకి తీసుకొని పచ్చ కర్పూరం ఆకు, వేరు ఉన్న ఆ మూటను పర్స్ లో లేదా పాకెట్లో పెట్టుకుని ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు విజయం మీ సొంతమవుతుంది.ఈ వేరును పాకెట్లో పెట్టుకుని బయటకు వెళితే ఆర్థిక తగాదాలు, అనారోగ్య, పెళ్లి, ఉద్యోగం వంటి సమస్యలు తీరుతాయి. ఇది చేయాలంటే ఆ ఇరవైఒక్క రోజులు లేదా 41 రోజులు కొన్ని నియమాలు పాటించాలి. 21 రోజులు చేయడం కుదరనివారు కనీసం అయిదు అమావాస్యలు చేయాలి. దీపావళి అమావాస్య రోజు మొదలుపెట్టి ఐదు అమావాస్యల పాటు ఇలా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.ఆ అయిదు అమావాస్యలు శ్వేతార్కం వేరు ని పూజించి బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లిపాయ తినకూడదు. ఎవరింటి దగ్గర భోజనం చేయకూడదు. ఏకభుక్తం భుజించాలి. ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. ఇలా చేరడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి.