ఒక సంవత్సరం పాటు భయంకరమైన తల నొప్పితో భాదపడింది ..ఆ తరువాత స్కాన్ చేసి చూస్తే..?

ఆమె ఒక ఏడాది పాటు భయంకరమైన తలనొప్పిని భరించింది ఆతర్వాత డాక్టర్లు ఆమె తలలో స్కాన్ చేసి చూడగా దిమ్మ తిరిగే విషయం బయటపడింది. ఇది కథ కాదు వాస్తవం అందరికీ ఉపయోగపడే విషయం తప్పకుండా పూర్తిగా చదవండి. టెక్సాస్ లో నివసించే ఎడిరా రోస్టో అనే ఆమె బాగా కష్టపడే స్వభావం కలిగిన ఆవిడ. ఆమె రోజు మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. 2015లో 31 సంవత్సరాలు ఉన్న ఎడిరాకు మాటిమాటికి భయంకరమైన తలనొప్పి రావటం మొదలైంది. మొదట్లో ఇది సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ అని అనుకుంది,కానీ మెల్లి మెల్లిగా ఈ నొప్పి ఎంత భయంకరంగా మారుతుంది అంటే ఆ ఎఫెక్ట్ ఆమె కళ్లపై కూడా పడటం మొదలైంది.ఆమె సరిగా చూడలేకపోయింది ఆమె తలలో ఏమి జరుగుతుందో అర్థమయ్యేది కాదు.కానీ ఇది ఏదో సీరియస్ ప్రాబ్లం అని తనకి అర్థం అయింది.ఇలా ఎవరికైనా కంటిన్యూగా తలనొప్పి వస్తుందంటే ఆ తరువాత భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకనే ఆమె డాక్టర్ని కలుద్దాం అని అనుకుంది డాక్టర్ కి ఆమె ప్రాబ్లం వివరించగా డాక్టర్ ఆమెకు సిటిస్కాన్ చేయించుకోవలసి ఉందిగా సూచించాడు. డాక్టర్స్ కూడా ఎడిరా తలలో ఏదో ఒకటి ట్యూమర్ ఉందేమోనని భయపడ్డారు ఆ తరువాత సిటీ స్కాన్ రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్ కి తన తలలో ఏదో ఉందని, వెన్నుపూసలో నుండి స్పైనల్ ఫ్లూయిడ్ బ్రెయిన్ వరకు చేరకుండా ఎదో ఆపుతుంది అని అర్థమైంది.అదేంటో క్లియర్గా తెలుసుకునేందుకు ఆమె తలపై ఆధునిక పరికరాలతో టెస్టులు చేశారు ఇక్కడ కూడా డాక్టర్ కి పూర్తిగా విషయం అర్థం కాలేదు. ఈసారి ఎంఆర్ఐ స్కాన్ చేసి చూద్దాం అని అనుకున్నారు మొదటినుంచి ఆమె బ్రెయిన్ లో ఏదో ఒక ట్యూమర్ తిష్ట వేసుకుని కూర్చుందనుకున్నరు. కానీ అది తప్పని తేలింది స్కానింగ్ లో ఆమె బ్రెయిన్ లో ఏదో గుండ్రటి ఆకారాలు కనిపించాయి అవి బ్రెయిన్ లోపలికి చొచ్చుకొని ఉన్నాయి.

ఇక్కడ దిమ్మతిరిగే షాకింగ్ విషయం ఏమిటంటే అవి ఒక టేప్ వార్మ్ యొక్క గుడ్లు, అంటే ఒక టేప్ వార్మ్ ఆమె మెదడులో గుడ్లు పెట్టింది. ఆమె సంవత్సరం పాటు అనుభవించిన భయంకరమైన నొప్పికి ఆ గుడ్లే కారణము. డాక్టర్స్ ఆమె ట్రీట్మెంట్ కోసం స్పెషల్ డాక్టర్స్ ని పిలిపించారు డాక్టర్స్ ఆమె మెదడు నుంచి గుడ్లను బయటికి తీయడానికి ఒక ప్లాన్ ను ఆలోచించారు. డాక్టర్స్ వచ్చి ఆమెకు అనస్తీషియా ఇచ్చి బ్రెయిన్ లో ఆ గుడ్లు ఉన్న భాగాన్ని ఓపెన్ చేశారు. అక్కడ డాక్టర్స్ కి ఎనిమిది టేప్ వార్మ్ గుడ్లు అంటుకొని కనిపించాయి. కంటికి కూడా కనిపించనంత చిన్న గా ఉన్న వాటిని ఆధునిక పరికరాలు ఉపయోగించి తొలగించారు. ఇక్కడ మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఆ గుడ్లు టేప్ వార్మ్ గా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ మొత్తం సర్జరీ డాక్టర్స్ వీడియో కూడా తీశారు. ఎడిరాకు కూడా వీడియో తీసిన విషయం తెలిసినప్పటికీ ఆమె ఆ వీడియో చూడటానికి ఇష్టపడలేదు నేను ప్రాణాలతో బయటపడ్డాను నా తల నొప్పి తగ్గిపోయింది ఇదే నాకు సంతోషం అని అన్నది.

కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు ఇప్పుడు గుడ్లను ఆపరేషన్ చేసి తీసేశారు. ఇక స్పైనల్ ఫ్లూయిడ్ చక్కగా బ్రెయిన్ వరకు చేరుతుంది ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది ఎటువంటి తలనొప్పి లేకుండా జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. సర్జరీ తర్వాత ఎడిరాని ఈ టేప్ వార్మ్ నీ బ్రెయిన్ లోకి ఎలా వచ్చాయో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆమె డాక్టర్ కి కొన్ని సందర్భాలను చెప్పింది అలా చెబుతూ చెప్తూ రెండు సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మెక్సికో వెళ్లాను అని చెప్పింది వెంటనే డాక్టర్ కి అర్థమైంది. అక్కడ ఆమె ఏదో పచ్చి మాంసము తినడం వల్ల దాంట్లో ఉన్న లార్వా ఎడిరా యొక్క శరీరంలోకి ప్రవేశించింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నివేదిక ప్రకారం ఈ టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి సరిగ్గా ఉడకని మాంసం గాని పచ్చి మాంసం గాని తింటే ఏదో ఒక పరాన్నజీవి తన శరీరం లోకి వెళ్లి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇక ఆ జీవి మీ శరీరంలో చాలా ఫ్రీగా, ఉత్సాహంగా తిరుగుతుంది. మీ టైం బాగోలేక పోతే ఆ జీవి మీ బ్రెయిన్ దాకా చేరడానికి ఎక్కువ టైం కూడా పట్టక పోవచ్చు.

పాపం ఎడిరాకు కూడా బహుశా ఇలాగే జరిగి ఉండొచ్చు అందుకనే మీరు ఏదైనా తినే ముందు తాగే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చేయండి. ఒకవేళ దేశం దాటి బయటకు వెళితే తాగే నీటి చుక్క కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రపంచంలో చాలా మంది వితండవాదులు కూడా ఉన్నారు. ఒక మనిషి శరీరంలో పరజీవి బతుకుతుంది అంటే వీళ్ళు అస్సలు నమ్మరు. అమెరికాలో ఇలా పరజీవి శరీరంలో ప్రవేశించడం వల్ల వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారని తెలిసింది. అదృష్టవశాత్తు ఎడిరా ఈ కేసు నుంచి బయటపడి బతికింది. ఆమెకు సరైన ట్రీట్మెంట్ అందింది కానీ ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడింది. కానీ చాలా మంది ఈ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేరు ఒక అంచనా ప్రకారం బ్రెయిన్ నుండి ఆ జీవిని తీయడానికి అయ్యే ఖర్చు దాదాపు 26 లక్షలు. కాబట్టి నెక్స్ట్ టైం మీరెప్పుడైనా బయట నాన్వెజ్ తినేటప్పుడు అది ఉడికిందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి తినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.