కాళ్ళపగుళ్ళు చిటికెలో తగ్గాలంటే….

ఈ రోజుల్లో కాళ్ళ పగుళ్లు సమస్యతో ఎక్కువమంది బాధపడుతున్నారు, చలికాలంలో వీటి బాధ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది, ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం! మన బాడీ లో డ్రైనెస్ ఎక్కువైనప్పుడు ఎక్కువగా కాళ్లు పగుళ్లు వస్తాయి, దీనిని మనం రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, ఎక్కువగా వాటర్ లో పని చేసేవారికి విపరీతంగా కాళ్ళ పగుళ్లు అనేది వస్తాయి. ఇంకా కొంత మందికి అయితే రక్తం కూడా రావడం జరుగుతుంది, ఇది సోరియాసిస్ అంటారు, బాగా వాతం ఉన్న వాళ్లకి కూడా ఇలా రావడం జరుగుతుంది. దీని కోసం మన ఇంట్లోనే దీనికి తగిన చిట్కా పాటించు కుంటూ వీటిని తగ్గించుకోవచ్చు.

ఇవేవీ పని చేయకపోతే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు, రోజు స్నానం చేసేటప్పుడు కాళ్ల దగ్గర కూడా స్క్రాప్ చేస్తూ ఉంటారు, ఇలా చేయడం వలన అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ, తర్వాత ఇలా రుద్దడం వలన మాయిశ్చరైజర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇలా చేయకుండా క్యూమీక్ స్టోన్స్ అని చాలా సాఫ్ట్ స్టోన్స్ ఉంటాయి, వీటిని వాడి పగుళ్ల దగ్గర క్లీన్ చేసుకోవచ్చు, అయితే ఎవరికైతే ఎక్కువ పగుళ్ళు ఉంటాయో, కుంకుడుకాయల దంచిన తర్వాత తొక్కలతో పగుళ్ల దగ్గర లు దూరం చేస్తే మీ కాళ్లు అనేది శుభ్రంగా కనిపిస్తాయి,కాళ్లు పగలవు.

తర్వాత నైట్ పడుకునే ముందు మీ కాళ్ల దగ్గర మాయిశ్చరైజ్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి, మన కాళ్ళ పగుళ్ళు ఉన్నాయంటే ఏదో డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ వస్తున్నాయని ఒక ఇండికేషన్, మన శరీరంలో ఏదో ఒక మూల ఏదో ఒకటి జరుగుతుందని తెలుసుకోవచ్చు. కొబ్బరి నూనె, వేప నూనె,పసుపు పెట్టి పాదాలను బాగామసాజ్ చేసుకోవాలి, అలా పడుకునే ముందు కాళ్ళకి సాక్సులు కానీ, కవర్లు కాని కట్టుకొని పడుకుంటారు, ఇలా అస్సలు చేయకూడదు, పాదాలకు గాలి తగలాలి, అప్పుడే అవి మాయిశ్చరైజర్ గా ఉంటాయి.